Maruti Dzire EMI Calculator: దేశంలో ప్రముఖ ఆటో మెుబైల్ కంపెనీల్లో మారుతీ సుజుకి ఒకటి. మార్కెట్లో ఈ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లలో సెడాన్ ఒకటి. ఇది LXi, VXi, ZXi మరియు ZXi+ వేరియంట్ ల్లో లభ్యం కానుంది. ఇందులో రెండు సీఎన్జీ వేరియంట్‌లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.6.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ.9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తోపాటు సీఎన్జీ కిట్ ను కూడా కలిగి ఉంది. ఈ కారు బేస్ వేరియంట్ కోసం మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి స్విఫ్ట్ వలె దీనికి కూడా 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ (90PS/113Nm) ఇవ్వబడింది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMTతో జత చేయబడింది. CNG వెర్షన్ 77PS మరియు 98.5Nm అవుట్‌పుట్‌లను అందిస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేయబడింది. 


1.2L MT - 22.41 kmpl
1.2L AMT - 22.61kmpl
CNG MT - 31.12 km/kg


ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 6.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ధర ఢిల్లీలో రూ.7.42 లక్షలు. ఇప్పుడు మీరు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేయబోతున్నారని అనుకుందాం. బడ్జెట్ ప్రకారం మీరు డౌన్ పేమెంట్ మరియు లోన్ వ్యవధిలో మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ మేము బ్యాంకు యొక్క వడ్డీ రేటు 9.8% మరియు లోన్ కాలవ్యవధి 5 ​​సంవత్సరాలు అని అనుకుంటాం. మీరు ప్రతి నెలా రూ. 13,596 EMI చెల్లించాలి. రూ. 6.42 లక్షల మొత్తం రుణం కోసం.. మీరు 5 సంవత్సరాలలో అదనంగా రూ. 1.72 లక్షలు చెల్లించాలి.


(Disclaimer:ఈ సమాచారం ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్ ఆధారంగా తీసుకోబడింది. ఇందులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే, కారు కొనడానికి ముందు, సంబంధిత డీలర్‌షిప్ నుండి ఫైనాన్స్ వివరాలను తీసుకోండి.)


Also Read: Ertiga Vs Kia Carens: మారుతి ఎర్టిగా నచ్చడం లేదా..? అద్భుత ఫీచర్లు కలిగిన కియా క్యారెన్స్ 7 సీటర్ ట్రై చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook