Bharti Airtel Shares: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎయిర్టెల్ షేర్లు డీలా..!
Bharti Airtel Shares: వారంలో తొలి రోజు స్టాక్ మర్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ల నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.
Bharti Airtel Shares: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికాం రంగాలు భారీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
బీఎస్ఈ- సెన్సెక్స్ ప్రస్తుతం 400కుపైగా పడిపోయి.. 55,456 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా కోల్పోయి 16,552 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ ప్రతికూల పవనాలు మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
కుప్పకూలిన భారతీ ఎయిర్టెల్..
భారతీ ఎయిర్టెల్ నేడు భారీగా కుదేలవుతున్నాయి. బీఎస్ఈ ఇంట్రాడేలో ఒకానొక దశలో ఎయిర్టెల్ షేర్ 3 శాతం పడిపోయింది. దీనితో షేరు ధర రూ.666.90 వద్దకు తగ్గింది.
ఇండస్ టవర్స్‌లో అదనంగా 4.7 శాతం వాటాను కొనుగోలు చేసేందుకుగానూ.. వొడాఫోన్ గ్రూప్‌తో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీనితో ఎయిర్టెల్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం షేరు విలువ 1.37 శాతం నష్టంతో రూ.678 వద్ద ట్రేడవుతోంది.
అయితే ఇండస్ టవర్స్ మాత్రం ఫ్లాట్‌గా ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం షేరు విలువ రూ.215 వద్ద ఉంది.
30 షేర్ల ఇండెక్స్‌లో.. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Also read: Flipkart Electronics Sale: రూ.21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.5 వేలకే కొనేయండి!
Also read: Gold Rate Today 28 February 2022: మహిళలకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన పసిడి ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook