Delete These Apps On Your Smartphone: మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా, ఇంటర్నెట్ వాడుతూ పదే పదే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోండి. ప్లే స్టోర్లలో మీకు కనిపించే ప్రతి యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయని బీజీఆర్ రిపోర్ట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను హెచ్చరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాప్స్ ద్వారా మీ ఫోన్‌లో ఉన్న బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆధార్, పాన్ నెంబర్స్ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును డ్రా చేస్తారు. సైబర్ క్రైమ్‌లు జరిగే అవకాశం ఉందని కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్(Android Apps) వివరాలు వెల్లడించింది. BGR Report ప్రకారం మీ ఫోన్‌లో ఈ కింద తెలిపిన యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది.


Also Read: Gold Price Today 12 March 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, Silver Price


మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే డిలీట్ చేసుకోండి
1- కేక్ వీపీఎన్ (Cake VPN) - com.lazycoder.cakevpns


2- పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN) - com.protectvpn.freeapp


3- ఈవీపీఎన్  (eVPN)  - com.abcd.evpnfree


4- బీట్‌ప్లేయర్ (BeatPlayer) -  com.crrl.beatplayers


5- క్యూర్/బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX)


6- మ్యూజిక్ ప్లేయర్ Music Player (com.revosleap.samplemusicplayers)


7- టూల్‌‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary)


8- క్యూరికార్డర్ (QRecorder)


మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా కొట్టేస్తారు. కనుక అందుకు అవకాశం కల్పించే యాప్స్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.


Also Read: Indian YouTubers Pay Tax: ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కు Google షాకింగ్ న్యూస్