Kiran Mazumdar Shaw husband John Shaw's death news: బయోకాన్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో డయాబెటిస్, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు తక్కువ ధరలోనే ఔషదాలు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బయోఫార్మా రంగంలో కృషిచేస్తోన్న బయోకాన్ కంపెనీకి జాన్ షా వైస్ చైర్మన్‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1978 లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉంటూ వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. బయోకాన్ కంపెనీకి విదేశీ ప్రమోటర్ గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందిస్తున్నారు. 


గతంలో మధుర కోట్స్ సంస్థకు చైర్మన్ గా, కోట్స్ వియెల్లా గ్రూప్ కంపెనీకి ఫైనాన్స్, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు. కాగా సోమవారం సాయంత్రం బెంగళూరులోని విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో జాన్ షా అంత్యక్రియలు ముగిశాయి. కిరణ్ మజుందార్ షా స్థాపించిన బయోకాన్ కంపెనీతో పాటు పలు ఇతర గ్రూప్ కంపెనీల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు వ్యాపారవర్గాలు చెబుతుంటాయి.


Also Read : Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read : Multibagger stocks: దీపావళికి ముందే బంపర్ లాభాలు ఆర్జించిన షేర్, నెలలో రెట్టింపు ధర


Also Read : Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి