Zee Chairman Subhash Chandra: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ సమన్లకు వ్యతిరేకంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. మార్చి 27న సెబీ నోటిసుల ప్రకారం మాత్రమే తమ వద్ద ఉన్న సమాచారం లేదా పత్రాలను అందించాలని సూచించింది. జనవరి 12న జారీ చేసిన సమన్లను విస్మరించవచ్చని తెలిపింది. సమన్లు ​​సెబీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవని.. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. నిధుల మళ్లింపుల కేసులో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ ఎమిరిటస్‌కు సెబీ సమన్లు ​​జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి 12న సెబీ పంపిన సమన్లు ​​సెబీ చట్టానికి విరుద్ధమని బాంబే హైకోర్టులో సుభాష్‌ చంద్ర పిటిషన్ దాఖలు చేశారు. సెబీ తనపై కుట్ర పన్నిందని.. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమన్లు ​​చెల్లవని.. చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. సమన్లు ​​పక్షపాతంగా, అన్యాయంగా, ఏకపక్షంగా, ముందుగా నిర్ణయించినవని ఆయన ఆరోపించారు. జనవరి 12 సమన్లకు చంద్ర స్పందించనందున దర్యాప్తును నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆరోపించింది. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణ చేపట్టగా.. రిట్ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను సెబీ అంగీకరించింది. జనవరి 12, 2024 నాటి సమన్లకు ప్రతిస్పందించవద్దని డాక్టర్ చంద్రకు కోర్టు సలహా ఇచ్చింది. 27 మార్చి 2024 నాటి నోటిసుల్లో సెబీ కోరిన సమాచారం ఇవ్వాలని మార్గనిర్దేశం చేసింది. ఏదైనా పత్రాలు అందుబాటులో లేకుంటే..  సెబీకి తన ప్రతిస్పందనలో అలా చెప్పవచ్చని సూచించింది. ఆ డాక్యుమెంట్స్‌  ఎక్కడ పొందాలో కూడా మార్గనిర్దేశం చేయవచ్చని బెంచ్ పేర్కొంది.


పక్షపాతానికి సంబంధించిన అవకాశాలను తొలగించేందుకు.. ఈ అంశాన్ని మరో సెబీ అధికారికి చేరవేస్తామని సెబీ హైకోర్టుకు తెలిపింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ అశ్వనీ భాటియా నుంచి కాకుండా ఇతర పూర్తికాల సభ్యుని తరుఫున తుది ఉత్తర్వు జారీ చేయిస్తామని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. 


Also Read: Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!


Also Read: Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి