BSNL Cheapest Plan: దేశంలోని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రమే ఇప్పుడు మార్కెట్లలోని ప్రధాన ప్రైవేట్ కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో పోటీపడుతోంది. టెలికాం కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చాలా చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాని గురించే చర్చించబోతున్నాం. BSNL లో అతి తక్కువ ధర అయిన రూ.49 లకే రీఛార్జ్ ప్లాన్ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయడం వల్ల యూజర్లకు పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL రూ. 49 రీఛార్జ్ ప్లాన్


ఈ రోజు మేము BSNL కు సంబంధించిన అన్ని రీఛార్జ్ ప్లాన్‌ల గురించి సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నాము. ఇందులో అతి తక్కువ లేదా చౌకైన ప్లాన్ రూ. 49 లకే అందుబాటులో ఉంది. రూ. 49 ధర కలిగిన ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు 2GB హై స్పీడ్ ఇంటర్నెట్.. 100 నిమిషాల వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తున్నారు. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంది. 


BSNL వాయిస్ వోచర్‌లు


బీఎస్ఎన్ఎల్ లో వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేక వోచర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.99 రీఛార్చ్ తో 22 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. ఇది వాయిస్ వోచర్ అవ్వడం కారణంగా ఇందులో డేటాకు సంబంధించిన ప్రయోజనాలేవి లభించవు. 


రూ.135ల వాయిస్ వోచర్


BSNL లో మరొక వాయిస్ వోచర్ కూడా ఉంది. రూ. 135 రీఛార్జ్ తో 1,440 నిమిషాల వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంది. 


BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్స్


BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకటైన రూ. 118 ప్లాన్ ద్వారా మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా 26 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 0.5GB డేటాను పొందవచ్చు.


రూ.147 రీఛార్జ్ ప్లాన్..


BSNL ప్రీపెయిడ్ ప్లాన్ లో రూ.147 కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 10 GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల గడువుతో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.  


Also Read: Amazon Sale: అమెజాన్ ఎలక్ట్రానిక్ సేల్.. హెడ్ ఫోన్స్ పై 86 శాతం డిస్కౌంట్!


Also Read: Airtel Recharge Plan: ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook