BSNL launched Rs.797 Prepaid Recharge Plan with 395 days validity: ప్రస్తుతం టెలికాం మార్కెట్లో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా సంస్థల హవా నడుస్తోంది. కొత్త ప్లాన్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తునాయి. వీటికి పోటీగా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకు అదిరిపోయే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ కస్టమర్ల కోసం రూ. 797కు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, హై-స్పీడ్ 4G డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా పరిచయ ఆఫర్‌ కింద మరో నెల వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ అదనంగా అందిస్తోంది. అంటే వినియోగదారులు ఈ ప్యాక్‌లో మొత్తంగా 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. 


రూ. 797 ప్యాక్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు . అయితే ఈ డేటా, కాల్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అన్ని కూడా తొలి 60 రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వ్యాలిడిటీ మాత్రమే కొనసాగుతుంది. ఇక ఇంటర్నెట్ స్పీడ్ కూడా 80kbpsకి పడిపోతుంది. రెండు నెలల తర్వాత వినియోగదారులు తమకు నచ్చిన డేటా, వాయిస్ ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవచ్చు.


ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 కాగా.. జూన్ 12లోగా రీచార్జ్ చేసుకుంటే అదనంగా 30 రోజుల (మొత్తంగా 395 రోజుల) వ్యాలిడిటీ దక్కుతుంది. ఇక డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు తొలి రెండు నెలలు మాత్రమే వస్తాయి. రూ. 797 ప్లాన్ అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ పోర్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ మరియు గూగుల్ పే, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. సెకండ్ సిమ్‌గా వినియోగిస్తున్న వారికి ఈ రూ.797 ప్లాన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Also Read: Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!


Also Read: Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. జలమయమైన హైదరాబాద్‌ మహానగరం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook