BSNL Cheap and Best Plans: బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ. జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు టారిఫ్ ప్లాన్స్ పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ క్రేజ్ పెరుగుతోంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్‌ఎల్‌కు మారేవారికి, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ వాడేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న చౌక ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఎస్ఎన్ఎల్‌లో అత్యంత చౌక ప్లాన్ 107 రూపాయలది అందుబాటులో ఉంది. ఇది 35 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటాతో వస్తోంది. వాయిస్ కాల్స్ 200 నిమిషాలు ఉంటుంది. కొత్త యూజర్లకు అయితే 108 రూపాయల ప్లాన్ ఉంది. రోజుకు 1జీబీ డేటా, 28 రోజులు వర్తిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అయితే 1999 రూపాయలకు లభిస్తోంది. ఇది 365 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో  మొత్తం 600 జీబీ డేటా సౌకర్యం కలుగుతుంది. ఈ ప్లాన్‌తోపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఇతర సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. 


బీఎస్ఎన్ఎల్ 397 రూపాయలు ప్లాన్‌లో మొత్తం 150 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. డేటా మాత్రం మొదటి 30 రోజులకు కేవలం 2 జీబీ ఉంటుంది. ఇక మరో ప్లాన్ 797 రూపాయలకు వస్తోంది. ఇది మొత్తం 300 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో కూడా మొదటి రెండు నెలలు 2 జీబీ డేటానే ఉంటుంది. అంటే ఈ రెండు డేటా ప్లాన్స్ కావు. కేవలం కాల్స్ చేసుకునేందుకు, డేటా పెద్దగా అవసరం లేనివారికి పనిచేస్తాయి. 


బీఎస్ఎన్ఎల్ 197 రూపాయల ప్లాన్ మరొకటి. ఇందులో 70 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దాంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. మొదటి 18 రోజులకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇందులో కూడా డేటా పెద్దగా ఉండదు. 


Also read: IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్‌కు ముందే కీలక మార్పులు, సీఎస్కే కొత్త కెప్టెన్‌గా రిషభ్ పంత్?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.