Stock Market today: బుల్‌కు బడ్జెట్ బూస్ట్- సెన్సెక్స్ 848 ప్లస్, 17,550పైకి నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.
Stock Market today: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.
బడ్జెట్ 2022 మార్కెట్లకు లాభాల పంట పండించిందని విశ్లేషకులు చెబుతున్నారు. నేటి సెషన్ ప్రారంభం నుంచి సూచూలు భారీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఒకానొక దశలో 1000 పాయింట్లకుపైగా లాభాన్ని నమోదు చేసింది సెన్సెక్స్.
ఆర్థిక వృద్ధిపై వెలువడిన సానుకూల అంచనాలు, వివిధ రంగాలకు ఇచ్చిన ఊరట వల్ల సూచీలు నేడు దూసుకెళ్లాయని అంటున్నార మార్కెట్ నిపుణులు.
నేటి సెషన్లో లోహ, ఫార్మా, ఐటీ షేర్లు భారీగా లాభాలను గడించాయి. అయితే ఆటోమొబైల్ షేర్లు కాస్త డీలా పడ్డాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,032 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 57,737 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 17,622 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,451 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 27 కంపెనీలు లాభాలను గడించాయి. 7 సంస్థలు నష్టపోయాయి.
టాటా స్టీల్ 7.57 శాతం, సన్ ఫార్మా 6.94 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.76 శాతం, ఎల్&టీ 4.48 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 4.13 శాతం లాభాలను గడించాయి.
ఎం&ఎం 1.30 శాతం, పవర్‌గ్రిడ్ 1.18 శాతం, ఎస్బీఐ 1.13 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.91 శాతం, ఎన్టీపీసీ 0.88 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్) నేడు లాభాలన గడించింది. చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా షాంఘై (చైనా), సియోల్ (దక్షిణ కొరియా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు థైవాన్ సూచీలు సెలవులో ఉన్నాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద కొనసాగుతోంది.
Also read: Budget 2022: త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు..ఇకపై మీ డేటా సేఫ్..
Also read: Budget 2022: ఆశల పద్దు 2022.. బడ్జెట్‌పై వివిధ వర్గాల్లో అంచనాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook