Nirmala Sitharaman Longest Budget speech: కరోనా వైరస్ మహమ్మారితో అతలాకుతలమైన భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా 2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో ముఖ్యంశాలపై ఆర్థిక మంత్రి సుదీర్ఘంగా మాట్లాడాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తిగా మరియు రాజకీయ నాయకురాలిగా నిర్మలమ్మ స్పీచ్ ప్రశాంతంగా, చమత్కారంగా ఉంటుంది. ఒక్కోసారి పదునుగా మరియు క్రూరంగా కూడా ఉంటుంది. ఏదేమైనా నిర్మలమ్మ ప్రసంగం బాగుటుంది. ఇప్పటివరకు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఆమెదే అతిపెద్ద రికార్డు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020 ఫిబ్రవరి 1న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు నిర్మలా సీతారామన్‌ సుదీర్ఘమైన బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇంకా రెండు పేజీల స్పీచ్ మిగిలిఉన్న సమయంలో ఆమెకు అసౌకర్యంగా ఉండడంతో.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. నుదిటిపై చెమట వస్తుండడంతో మిగతా బడ్జెట్ స్పీచ్ ప్రసంగించినట్టు తాను భావిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో సీతారామన్‌ స్పీచ్ ఆపేశారు. భారత దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద బడ్జెట్ స్పీచ్. ఆ స్పీచ్లో 13,275 పదాలు ఉన్నాయట. 


జూలై 5 2019న నిర్మలా సీతారామన్ మొదటి బడ్జెట్ ప్రసంగం చేశారు. అప్పుడు నిర్మలమ్మ 2 గంటల 17 నిమిషాల పాటు తన స్పీచ్ కొనసాగించారు. ఆ రికార్డును 2020లో బద్దలు కొట్టారు. అంతకుముందు 2003-04 సంవత్సరానికి గాను అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ 2 గంటల 15 నిమిషాల పాటు ప్రసంగించారు. నిర్మలా సీతారామన్ తన అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1 గంట 40 నిమిషాలు (10,500 పదాలు) చేశారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఓ టాబ్లెట్‌ ద్వారా ప్రసంగం చేశారు. ఇక 1977లో మాజీ ఆర్థిక మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ అతడి తక్కువ స్పీచ్ ఇచ్చారు. 


ఇక బడ్జెట్ ప్రసంగంలో వాడిన పదాల్లో నిర్మలా సీతారామన్ మూడో స్థానంలో ఉన్నారు. 1991లో నరసింహారావు ప్రభుత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో 18,650 పదాలు ఉపయోగించారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్ ప్రసంగంలో  చాలా దగ్గరగా వచ్చారు. అతను 1 గంట 49 నిమిషాల్లో 18,604 పదాలను వాడారు. టాప్-5లో అరుణ్ జైట్లీ ప్రసంగ పదాలు మూడు ఉండడం విశేషం. 


Also Read: Gas Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, భారీగా తగ్గిన సిలెండర్ ధర


Also Read: AP PRC Issue: ఆన్‌లైన్‌లో ఏపీ ఉద్యోగుల కొత్త జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ స్లిప్స్‌ రెడీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook