Amaravati Budget 2024:కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజధాని అమరావతి  అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని సీతారామన్ తెలిపారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలమైందన్నారు. హైదరాబాద్ -బెంగళూరు పారిశ్రామిక కారిడార్ డెవలప్ మెంట్ కు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రవార్షిక బడ్జెట్ లో ఎన్డీఏ సర్కార్ అనేక రంగాలతోపాటు రాష్ట్రాల డెవలప్ మెంట్ కోసం, మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటాయించింది. దీనిలో భాగంగానే ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఈ వార్షిక ఏడాదికి గాను 15వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని..కావాలంటూ రాష్ట్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కేంద్రాన్ని కోరతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీకి కేంద్ర ప్రత్యేక హోదా సాధ్యపడదంటూ గతంలో చెప్పింది. అయితే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని మోదీ సర్కార్ తెలిపింది. రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను కేటాయిస్తామంటూ మాటిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులను కేటాయించింది కేంద్రం. 


ఆ జిల్లాలకు ప్రత్యేక నిధులు: 


ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 


Also Read: Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ధరలు భారీగా తగ్గుదల?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి