Anyone can earn Daily Rs 1000/ Day: దేశవ్యాప్తంగా వ్యాపారాల పర్వం విస్తరిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆర్థికంగా బలపడేందుకు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా  స్టార్టప్‌ల ట్రెండ్ కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం చాలా మంది తక్కువ పెట్టుబడులతో భారీ లాభాలు పొందుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఫుడ్‌ బిజినెస్‌తో పాటు చాయ్‌ తయారికీ సంబంధించిన ఔట్‌లేట్స్‌ను రూపొందించి వ్యాపారాలుగా ఎంచుకుంటున్నారు. అయితే విద్యార్థులు కూడా పార్ట్‌టైమ్‌లో కూడా సులభంగా చేసుకునే వ్యాపారాల గురించి ఈ రోజూ తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారి కోసం:


1. బ్లాగింగ్:
ఇది ఇంటర్నెట్ యాక్సెస్, సోషల్ మీడియా యుగం..కాబట్టి చాలా మంది బ్లాగింగ్, రైటింగ్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది ఆలోచనలతో కూడుకున్నది కాబట్టి దీనిని విద్యార్థులు సులభంగా చేయోచ్చు. అయితే దీనిని మార్కెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. కాబట్టి మీరు దీని ద్వారా సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా రోజుకు  రూ. 500 నుంచి రూ.1000 వరకు పొందొచ్చు.


2. ఫ్రీలాన్సింగ్:
భారతదేశంలోని చాలా మంది యువకులకు స్వయం ఉపాధి కోసం ఫ్రీలాన్సింగ్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఈ వ్యాపారం చేసేందుకు తప్పకుండా ఆలోచనలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాపారం చేసేందుకు మార్కెట్‌లో క్లయింట్‌లను పొంది.. వివిధ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో జీతం మీ క్లయింట్స్‌పై ఆధారపడి ఉంటుంది.


3. కంటెంట్ డెలివరీ సేవలు:  
కంటెంట్ డెలివరీ సర్వీస్ కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో భాగమే.. అయితే మీకు కంటెంట్‌ మీదా పట్టు ఉంటే వెబ్‌ సైట్స్‌కి కంటెంట్‌ అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. అయితే ఇందులో జీతం మీ కంటెంట్‌ మీ నాలెజ్డ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎక్కువగా కష్టపడితే ఎక్కువగా డబ్బులు సంపాదించే అవకాశాలున్నాయి.


Also Read: PNG CNG Gas Price: 10% వరకు తగ్గనున్న పీఎన్‌జీ-సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్


4. బిజినెస్ కన్సల్టెంట్:
 మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చని మీకు అనిపిస్తే. మీ ఆలోచనలు నిజంగా మంచివి అయితే.. వ్యాపార సలహాదారునిగా మారడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం బిజినెస్ కన్సల్టెంట్ మంచి డిమాండ్‌ ఉంది. ఈ వ్యాపారాల్లో మీరు మీ ఆలోచనపై డబ్బు సంపాదించడానికి అవకాశాలున్నాయి.


5. వెబ్ డెవలప్‌మెంట్:
సాంకేతిక పెరగడం కారణంగా చాలా మంది వెబ్ డెవలప్‌మెంట్ ఆధారపడుతున్నారు. అవును దీని వల్ల కూడా మీరు చాలా లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా మీరు తక్కువ పెట్టుబడితో భారీ లాభాన్ని పొందడానికి తప్పకుండా వెబ్ డెవలప్‌మెంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.


Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook