Business Ideas:  బిజినెస్ చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ఇప్పుడు మేము ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . సాయంకాలం వేళ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చపాతీలు పుల్కాలు తినేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇం దుకు ప్రధాన కారణం ఉంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కారణంగా డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే క్యాలరీలు కూడా తక్కువగా ఉండే చపాతీలు పుల్కాలు తినమని డాక్టర్లు ఎక్కువగా సలహా ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చపాతీలు పుల్కాలు బిజినెస్ ప్రారంభించినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. 


చపాతీ, పుల్కా మెషీన్ తో రెట్టింపు ఆదాయం:


అయితే చాలా మంది సాంప్రదాయంగా చేతులతో వొత్తి చేస్తే చపాతీలు పుల్కాలతో ఎక్కువగా ఆదాయం లభించదని, పనివారిని పెట్టుకుంటే వారికి జీతంతోనే సరిపోతుందని, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎందుకు పరిష్కారమే చపాతీ పుల్కా మేకింగ్ మిషన్. ఈ మిషన్ లో కేవలం పిండి వేస్తే చాలు చపాతీలు, పుల్కాలు తయారై బయటకు వస్తాయి. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పలు నగరాల్లో, ఇలా పుల్కా మేకింగ్ మిషన్ ద్వారా చపాతీలు చేస్తున్నారు. ఇప్పుడు చపాతీ పుల్కా మేకింగ్ మిషన్ ధర ఎంతో తెలుసుకుందాం. 


రోటీ మేకింగ్ మెషీన్ ధర :


రోటి మేకింగ్ మిషన్ ధర 2 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో కేవలం పిండి వేస్తే చాలు బయటకు చపాతీలుగాను పుల్కాలుగాను తయారు అయి వస్తాయి. మీకు పని వాళ్ళతో పనిలేదు గంటకు 1000 చపాతీలను తయారు చేయవచ్చు. కేవలం మీరు కూరలను తయారు చేసి పెట్టుకుంటే చాలు. మీరు ఈ రోటీ మేకింగ్ మిషన్ ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. 


బిజినెస్ టిప్ : 


చపాతీలను పుల్కాలను హోం డెలివరీ చేయడం ద్వారా. మీకు రెగ్యులర్ కస్టమర్లు తయారవుతారు. దీంతోపాటు మీరు మెస్సులు, ఇతర కర్రీ పాయింట్స్ కు సైతం చపాతీలను పుల్కాలను హాట్ బాక్స్ ల ద్వారా సప్లై చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ఈ రోటి మేకింగ్ మిషన్ నిర్వహణ కూడా చాలా సులభం. . ఈ బిజినెస్ సరిగ్గా రన్ చేసుకుంటే నెలకు ఖర్చులు పోను లక్షకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.