Canara Bank Hikes MCLR: కెనరా బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. లోన్లపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈఎంఐలు మరింత ఖరీదు కానున్నాయి. ఎంసీఎల్ఆర్ ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్లపై వడ్డీ పెరుగుతుంది. పెంచిన రేట్లు ఏప్రిల్ 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను కాల వ్యవధికి 8.40 శాతం నుంచి 8.45 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌ను  8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచింది. అయితే మిగిలిన పదవీకాలానికి సంబంధించి వడ్డీ రేటులో ఎలాంటి మార్పుచేయలేదు. 3 నెలల్లో 8.15 శాతం, ఒక నెలలో 8.0 శాతంగా ఉంటుంది. ఓవర్‌నైట్ ఎంసీఎలర్‌ వడ్డీని 7.90 శాతంగా ఉంది. కెనరా బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడంతో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు పెరగనున్నాయి. దీంతో ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. 


ఏప్రిల్ 6న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక పాలసీ రేట్లను ప్రకటించిన తరువాత.. ఇటీవల పలు బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను పెంచాయి. దవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేటును పెంచని విషయం తెలిసిందే. ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ.. బెంచ్‌మార్క్ పాలసీ రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించుకుంది. రెపో రేటును మార్చకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. 


Also Read: PBKS vs GT Dream 11 Tips: గుజరాత్‌తో పంజాబ్ సమరం.. ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ఆల్‌రౌండర్.. డ్రీమ్11 టిప్స్   


గతేడాది మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపోరేటును పెంచింది ఆర్‌బీఐ. మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత.. ఇటీవల రేటు పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంసీపీ) ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించేటప్పుడు భవిష్యత్తులో రెపోరేటును పెంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఎంసీఎల్ఆర్‌లో లింక్ చేసి లోన్ తీసుకున్నవారిపై భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ ఆధారంగా బ్యాంకులు ఈఎంఐలలో మార్పులు చేస్తాయి.  


Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.