Car Mileage Boosting Tips: ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ టిప్స్‌తో మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు..
Car Mileage Boosting Tips And Tricks In Telugu: ప్రస్తుతం చాలామంది కారు నడిపే క్రమంలో కొన్ని చేయకూడని తప్పులు చేస్తున్నారు. దీని కారణంగా కూడా కారు మైలేజీ తగ్గుతూ వస్తోంది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా.? మీరు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి.
Car Mileage Boosting Tips And Tricks In Telugu: ప్రస్తుతం చాలామంది బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్లు మొదటగా మైలేజీని ఎక్కువగా ఇచ్చినప్పటికీ వాడే కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనివల్ల ఎంత పెట్రోల్ డీజిల్ పోయించిన మళ్లీ లో ఫ్యూయల్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు కార్లలో ఎక్కువగా తిరిగే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల చాలామంది పెట్రోల్‌పై ఎక్కువగా డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. ఇకనుంచి ఈ సమస్యతో బాధపడనక్కర్లేదు.. మెకానిక్ దగ్గరికి వెళ్లకుండానే మీ కార్ మైలేజీని పెంచవచ్చు. మీకు అందించే కొన్ని చిట్కాలను వినియోగించి సులభంగా మీ కార్ మైలేజ్ బూస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కార్ మైలేజీకి టైర్ ఒత్తిడికి ప్రత్యేక సంబంధం:
చాలామందికి తెలియని విషయమేమంటే..కారు మైలేజీ అనేది కార్ల టైర్లపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టైర్ ప్రెజర్ మెయింటెయిన్ చేయడం చాలా మంచిది. అంతేకాకుండా నాలుగు టైర్లలో సరైన గాలి లేకపోతే పెట్టించుకోవడం మేలు.. ఎందుకంటే కారు బరువును టైర్లలోని గాలి బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి పాడైపోయిన టైర్లతో ఇంకా కార్లు నడుపుతున్న వారు తప్పకుండా కొత్త టైర్లను వేయించుకోవడం చాలా మంచిది.
ఒకే పద్ధతిలో కారుని నడపాలి:
ప్రస్తుతం చాలామంది రోడ్లపై చాలా వేగంగా వెళుతూ ఉంటారు. దీని కారణంగా రోడ్లపై ఉన్న గుంతలు, చిన్న చిన్న గొయ్యిలు కార్ల మైలేజీ పై ప్రభావాన్ని చూపుతాయట. గుంతల గల రోడ్లపై ఎక్కువ స్పీడ్ వెళ్లడం వల్ల వీల్ అలైన్ మెంట్ పై ప్రభావం పడి కారు మైలేజ్ తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి కారులను నడిపేవారు గుంతలను రోడ్లను చూస్తూ ఒకే పద్ధతిలో నడపడం చాలా మంచిది.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
కారు విండోస్ క్లోజ్ చేయండి:
చాలామంది కారులోని డీజిల్, పెట్రోల్ ను ఆదా చేసుకోవడానికి ఏసీలను ఆఫ్ చేసి మరి.. కార్ విండోస్‌ని తెరుస్తారు. ఇలా చేయడం వల్ల మీ కారు మైలేజీపై తీవ్ర ప్రభావం పడుతుంది. కారుకు సంబంధించిన అన్ని విండోస్‌ని తీయడం వల్ల అందులోకి గాలి ప్రవేశించి కారు వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా కారు మైలేజీ క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కారు మైలేజీ తగ్గడానికి ప్రధాన కారణం ఇది కూడా ఒకటి. కారు మైలేజ్ అని పెంచుకోవడానికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండోస్ ని ఎప్పుడు మూసి ఉంచాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter