Income Tax Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా..ఒకవేళ చేయకుండా మీపై చర్యలు తీసుుకునే అవకాశముంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసులు జారీ చేయనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఛైర్మన్ నితిన్ గుప్తా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కచ్చితమైన సమాచారం ఉన్నవారికి ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసులు జారీ చేయనుందని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఇప్పటికే ట్యాక్స్ డిడక్షన్ అయినవారికి కూడా ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసులు పంపించనుంది. ఇన్‌కంటాక్స్ శాఖ వద్ద ట్యాక్స్ పేయర్ల గురించి కచ్చితమైన సమాచారం ఉందని. ఆ సమాచారం మేరకే ఈ దాడులు లేదా నోటీసులు జారీ చేయడం ఉంటుందన్నారు. అంటే మీ ట్యాక్స్ డిడక్షన్ జరిగి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉండి ఉంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుతాయి. ఆదాయం, ట్యాక్స్ విషయాల్లో ఎవరి గురించైతే కచ్చితమైన సమాచారం ఉంటుందో వారికే నోటీసులు అందుతాయి. 


ఐటీ రిటర్న్స్ అప్‌డేట్ చేయడం, ట్యాక్స్ వివాదాల పరిష్కారం, ఐటీ రిఫండ్ త్వరగా అందేట్టు చేయడమే ఇన్‌కంటాక్స్ శాఖ ప్రధాన ఉద్దేశ్యం. అదే విధంగా ట్యాక్స్ పేయర్లకు మరిన్ని సేవలు అందించడమే ఇన్‌కంటాక్స్ శాఖ లక్ష్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మైసూరులో ఓ డిమాండ్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిందని, తద్వారా కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయని తెలిపింది. ఈ తరహా వివాదాలున్నప్పుడు ట్యాక్స్ పేయర్లు సీఏను సంప్రదించాల్సి వస్తుంది. 


కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్డెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. 1962 నుంచి ఆపరిష్కృతంగా ఉన్న వివాదాలు ఇప్పటిక ఉన్నాయి. 2009010 సంవత్సరం వరకూ ఉన్న అవుట్ స్టాండింగ్ డైరెక్ట్ ట్యాక్స్ డిమాండ్‌లో 25 వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. అదే 2010-11 వరకైతే 10 వేలు డ్రా చేసుకోవచ్చు. 


Also read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు గమనిక, నిలిచిపోయిన ఆధార్ సేవలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook