CBI Arrests Videocon Founder Venugopal Dhoot: బిజినెస్ సర్కిల్స్ నుంచి ఒక భారీ షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ కు గురించి సీబీఐతో సంబంధం ఉన్న వారు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను దర్యాప్తు సంస్థ ఇప్పటికే అరెస్టు చేసిందన్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆయన మూడు రోజుల పాటు సీబీఐ రిమాండ్‌లో ఉండనున్నారు. సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 71 ఏళ్ల ధూత్‌ను సోమవారం నాడే ముంబై నుంచి అరెస్టు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త అరెస్ట్‌ అయిన మూడు రోజుల తర్వాత వేణుగోపాల్ ధూత్‌ అరెస్ట్‌ కావడం గమనార్హం. అనంతరం ముంబైలోని ప్రత్యేక కోర్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త ఇద్దరినీ మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.


అవినీతి నిరోధక చట్టం కింద 2019లో నమోదైన బ్యాంక్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ నిందితులుగా పేర్కొంది. ఆయనతో పాటు దీపక్ కొచ్చర్ నడుపుతున్న న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్), సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ సంస్థలను కూడా లు ఈ కేసులో నిందితులుగా చేర్చింది సీబీఐ.


బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలను సదుపాయాలను కల్పించిందని సీబీఐ ఆరోపించింది. 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇచ్చింది.


ఆ తరువాత NPA గా మారడంతో దానిని "బ్యాంక్ మోసం" అని తేల్చారు 2012లో చందా కొచ్చర్ నేతృత్వంలోని ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్‌కు 3,250 కోట్ల రుణాన్ని అందించగా, ఆరు నెలల తర్వాత వేణుగోపాల్ ధూత్ యాజమాన్యంలోని ఎం/ఎస్ సుప్రీం ఎనర్జీ, ఎం/ఎస్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌కు కూడా 64 కోట్ల రుణాన్ని ఇచ్చింది. ఈ కంపెనీలో దీపక్ కొచ్చర్ 50% వాటా కలిగి ఉన్నారు.


Also Read: Neha Sharma Bikini Photos: గోవా బీచ్లో నేహా శర్మ బికినీ ట్రీట్.. మందారంలో మెరిసిపోతోందిగా!


Also Read: BRS MPTC: సిద్దిపేట జిల్లాలో అధికార పార్టీ నేత దారుణహత్య.. నరికి నరికి చంపేశారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.