Central Bank Of India: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్‌లను క్లోజ్‌ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరం మార్చి నాటికి శాఖల తగ్గింపుపై నిర్ణయం అమల్లోకి రాబోతున్నట్టు ఓ ప్రముఖ వార్త సంస్థ కథనంలో వెల్లడించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంక్‌ స్థితిగతులను మెరుగు పరిచేందుకు ఇండ్ల స్థలాలు, నాన్‌కోర్‌ ఆస్థులను అమ్మాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పొదుపు చర్యలు తీసుకున్నట్టు వార్తలు వచ్చినా..సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా శాఖలను క్లోజ్‌ చేసే అంశం ప్రస్థావనకు రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌కు 100 ఏళ్ల చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా 4,594 బ్రాంచ్‌లు ఉన్నాయి. 2017వ సంవత్సరంలో RBI రూపొందించిన మార్గదర్శకాలు..నిబంధనలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థలు ఉల్లంఘించాయని తెలుస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు క్లోజ్‌ చేసే అంశంపై ఆ బ్యాంక్‌ అధికారులు స్పందించలేదు. 2017లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక బ్యాంకులు RBI ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) జాబితాలో చేర్చబడ్డాయి. దీని తరువాత, 2018 లో కూడా 12 బ్యాంకులు RBI, PCAలో చేర్చబడ్డాయి.


2018లో 12 బ్యాంకులు PCAలో చేర్చబడ్డాయి
ఈ జాబితాలోకి వచ్చే బ్యాంకులకు అనేక ఆంక్షలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కల్పించారు. 2018లో కూడా 12 బ్యాంకులను ఆర్‌బిఐ పిసిఎ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంచారు. ఆ సమయంలో వాటిలో 11 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు.. ఒక ప్రైవేట్ బ్యాంకు ఉంది. వీరికి అదనపు వర్కింగ్ క్యాపిటల్ అందించారు. 


ఇతర బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడింది
మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా, మిగిలిన అన్ని బ్యాంకులు PCA జాబితా నుంచి బయటకు వచ్చాయి. కానీ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో, సెంట్రల్ బ్యాంక్ ఈ జాబితాలోనే ఉండిపోయింది. అటువంటి పరిస్థితిలో, బ్యాంకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో, 13 శాతం శాఖలను మూసివేయాలని ఆలోచిస్తున్నారు.


Also Read: Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు


Also Read: Jodhpur Communal Violence: జోద్‌పూర్‌లో రేపు రాత్రి వరకు కర్ఫ్యూ పొడింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.