Mahila Samman Bachat Yojana: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఇలా ఎన్నో ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవింగ్ పథకాల సరసన ఇప్పుడు మరో పథకం వచ్చి చేరింది. అదే మహిళా సమ్మాన్ బచత్ యోజన. నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ 2023 నుంచి ఈ కొత్త పథకం ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం మహిళల కోసం ప్రారంభమైన మహిళా సమ్మాన్ బచత్ యోజనను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతో అధికారికమైంది. మహిళా సమ్మాన్ బచత్ యోజన అనేది ఒకేసారి పెట్టుబడి పెట్టే సేవింగ్ స్కీమ్. ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంటుంది. 2025 మార్చ్ వరకూ రెండేళ్ల కాలానికి వర్తిస్తుంది. 


ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల కాల పరిమితి కోసం మహిళలు లేదా అమ్మాయిల పేరుపై 2 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ యోజనలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు కాగా గరిష్టంగా 2 లక్షల రూపాయలుంటుంది. ఈ పథకం కింద ఓపెన్ చేసే ఎక్కౌంట్ సింగిల్ ఎక్కౌంట్ మాత్రమే ఉంటుంది. వార్షిక వడ్డీ 7.5 శాతం చొప్పన మూడు నెలలకోసారి జమ చేస్తారు. 


జమ చేసిన తేదీ నుంచి అంటే రెండేళ్లు పూర్తయ్యాక మెచ్యూరిటీ ఉంటుంది. ఖాతాదారులు  ఎక్కౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి ఏడాది తరువాత అంటే మెచ్యూరిటీ కంటే ముందే గరిష్టంగా 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవింగ్ పథకాలతో పోలిస్తే వడ్డీ అత్యధికంగా లభిస్తున్న పథకం మహిళా సమ్మాన్ బచత్ యోజన ఇదే. అందుకే ఈ పథకం ప్రాచుర్యం పొందుతుందని ఆశిస్తున్నారు. 


Also read: Investment rules: పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారా..ఇవాళ్టి నుంచి కొత్త నియమాలొచ్చాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook