Most Selling Two Wheelers: ఎవరైనా ఏదైనా కొనాలి అని ప్లాన్ చేసేటప్పుడు ముందుగా చేసే పని ఏంటి ? తాము కొనాలనుకుంటున్న వస్తువుకు సంబంధించి ఏ కంపెనీ ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, జనం ఏది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనే కదా. ఇదే సూత్రం ట్వూ వీలర్స్‌కి సైతం వర్తిస్తుంది. ద్వచక్ర వాహనం కొనాలి అని అనుకునే వారు చూసే అంశం కూడా ఇటీవల కాలంలో ఏ కంపెనీ బైకులను జనం ఎక్కువగా కొంటున్నారు అందులో ఏ మోడల్స్ ఎక్కువగా జనం ఇష్టపడుతున్నారు అనే చెక్ చేస్తారు. జనం ఒక రకమైన బైకును ఎక్కువగా కొంటున్నారు అంటే .. అంతమంది జనం ఆ బైకును ఇష్టపడుతున్నారు అనే కదా అర్థం. అందుకే జనం ఏ బైక్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయనే ముందుగా తెలుసుకుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ 2023 ఏడాదిలో ఏ కంపెనీ నుంచి ఏ మోడల్ బైక్ ఎక్కువగా సేల్ అవుతుంది అనే విషయానికొస్తే..


హోరో మోటోకార్ప్ నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్స్ 2,62,249 యూనిట్స్ సేల్ అయ్యాయి.


హోరో మోటోకార్ప్ కంపెనీ నుంచి హీరో హెచ్ఎఫ్ డిలక్స్  బైక్స్ 1,27,330 యూనిట్స్ సేల్ అయ్యాయి.


ఈ ఏడాదిలో హోండా కంపెనీ తయారు చేసిన సీబీ షైన్ బైక్స్ 1,19,765 మేర బైక్స్ అమ్ముడయ్యాయి.


బజాజ్ కంపెనీ నుంచి ఫేమస్ ప్రోడక్ట్స్ లో ఒకటైన బజాజ్ పల్సర్ ఈ ఏడాది 69,241 యూనిట్స్ సేల్ అయ్యాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ మోటార్ బైక్స్ 29,959 వరకు అమ్ముడయ్యాయి.


హీరో కంపెనీ నుంచి వచ్చిన గ్లామర్ బైక్స్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈ బైక్స్ 28,363 వరకు సేల్ అయ్యాయి.  


టీవీఎస్ కంపెనీ తయారు చేసిన టీవీఎస్ అపాచి బైక్స్ 27,044 అమ్ముడయ్యాయి. 


లో బడ్జెట్ బైక్స్‌లో ఒకటైన బజాజ్ ప్లాటినా బైక్స్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈ బైక్స్ 17,336 వరకు సేల్ అయ్యాయి.


యమహా బైక్స్‌లో యమహా ఎఫ్‌జి బైక్‌కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,068 యమహా ఎఫ్‌జి బైక్స్ సేల్ అయ్యాయి. 


ఈ  టాప్ 10 బైక్స్ జాబితాలో టీవీఎస్ నుంచి మరో బైకుకి చోటు దక్కింది. ఈ ఏడాది 11,818 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ సేల్ అయ్యాయి.