Safest Cars in India: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే.. సేఫ్టీ రేటింగ్స్, ధరల వివరాలు ఇదిగో
Safest Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరసమైన ధరలో భద్రతను అందించే కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా బ్రాండ్స్ ఎప్పుడూ ముందే ఉంటాయనే విషయం తెలిసిందే.
Cheap and Best Safest Cars in India 2023: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరసమైన ధరలో భద్రతను అందించే కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా బ్రాండ్స్ ఎప్పుడూ ముందే ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, కార్లు కొనుగోలు చేసే వారికి ఎరికైనా తక్కువ ధరలో, ఎక్కువ భద్రతను అందించే కార్లు ఏం ఉన్నాయా అనే కోణంలోనే అన్వేషిస్తుంటారు కనుక రీడర్స్ కోసం ఆ వివరాలను అందించే ప్రయత్నమే ఈ వార్తా కథనం. ఆ జాబితాలో టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్, మహింద్రా XUV300, స్కోడా కుషాక్ వంటి కార్లు ఉన్నాయి.
టాటా పంచ్ కారు:
2021 అక్టోబర్ లో టాటా పంచ్ కారు మార్కెట్లోకి లాంచ్ అయింది. టాటా మోటార్స్ తయారుచేసిన ఈ మైక్రో SUV కారుకు భారీ జనాధరణ ఉంది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత సప్లై చెయిన్ దెబ్బ తిన్నప్పటికీ.. టాటా పంచ్ కార్లపై ఆ ప్రభావం పడలేదు. లాంచ్ అయిన కొద్దికాలంలోనే లక్షకుపైగా కార్లు అమ్ముడయ్యాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో టాటా పంచ్ కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్ లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో 4/5 రేటింగ్ లభించింది. టాటా పంచ్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టాటా ఆల్ట్రోజ్ కారు
2018 ఆటో-ఎక్స్ పోలో టాటా ఆల్ట్రోజ్ కారు లాంచ్ అయింది. ఈ కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్ లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ లో 3/5 లభించింది. టాటా ఆల్ట్రోజ్ కారు ఎక్స్ షోరూం ధర రూ 6.45 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టాటా నెక్సాన్ కారు
ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న SUV కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్స్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. సేఫ్టీ రేటింగ్స్ పరంగా అడల్ట్స్ రేటింగ్ లో 5/5 రేటింగ్ రాగా.. చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ లో టాటా నెక్సాన్ కారుకు 3/5 రేటింగ్స్ లభించాయి. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూం ధరలు రూ. 7.80 లక్షలు గా ఉంది.
మహింద్రా XUV 300 కారు
2019 మహింద్రా XUV కారు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయింది. మహింద్రా అండ్ మహింద్రా తయారుచేసిన ఈ SUV కారు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో వరుసగా మూడేళ్లపాటు ముందు వరుసలోనే ఉంటూ వస్తోంది. మహింద్రా XUV 300 కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్ లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో 3/5 రేటింగ్ లభించింది. మహింద్రా XUV 300 కారు ఎక్స్ షోరూం ధర రూ. 8.41 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
స్కోడా కుశాఖ్ కారు
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టింగ్ కొత్త స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్రాష్ టెస్ట్ పాస్ అయిన ఈ కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్స్ లో 5/5 రేటింగ్ లభించింది. అలాగే చైల్డ్ సేఫ్టీ రేటింగ్ లోనూ 5/5 రేటింగ్ లభించడం విశేషం. స్కోడా కుశాఖ్ కారుకు ఎక్స్ షోరూం ధర రూ.11.59 లక్షలుగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కార్లలో కొంత ఖరీదు ఎక్కువగా ఉన్న కారు కూడా ఇదే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook