Hyundai Creta Cars Under Rs 5 lakhs: ఎక్కువగా సేల్ అవుతున్న ఎస్‌యువి కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. హ్యూందాయ్ క్రెటా బేసిక్ వేరియంట్ ధర రూ. 10.64 లక్షలు కాగా లైఫ్ టైమ్ రోడ్ ట్యాక్స్, వగైరా అన్నీ కలిపి మీకు ఆన్-రోడ్ వచ్చేటప్పటికి రూ.12 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ఎస్‌యువి సెగ్మెంట్లో హ్యూందాయ్ క్రెటా కార్లకు ఎంతో క్రేజ్ ఉంది. అయితే, అంత ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయలేని వారికి యూజ్‌డ్ కార్లు ఒక సరైన సదవకాశం. ఇప్పటికే ఎవరైనా ఉపయోగించిన హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో చాలా కార్లు రెడీగా ఉన్నాయి. అదే కారు, అవే ఫీచర్స్, అదే లగ్జరీ.. కానీ ధర మాత్రం తక్కువే. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెకండ్ హ్యాండ్ హ్యూందాయ్ క్రెటా కార్ల కోసం ఫిబ్రవరి 6న ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్లో సెర్చ్ చేసి చూడగా.. రూ. 4.75 లక్షల నుండి ప్రారంభం అయ్యే హ్యుందాయ్ క్రెటా కార్లు కనిపించాయి. అయితే, ఇలా ఇంటర్నెట్లో వెకితే వారి సంఖ్యకు కూడా తక్కువేమీ లేదు కాబట్టి.. ఆలస్యం చేస్తే ఆ కార్లు మరెవరి సొంతమైనా కావొచ్చు.


1. హ్యుందాయ్ క్రెటా (2017)
2017 మోడల్‌కి చెందిన హ్యుందాయ్ క్రెటా కారు ఇప్పటివరకు 24,213 కి.మీ తిరిగింది. తక్కువ కిలోమీటర్లే తిరిగినందు వల్ల కారు కండిషన్ కూడా బాగుంది. ఈ కారును రూ.4.75 లక్షలకు అమ్మకానికి పెట్టారు. తెలుపు రంగులో ఉన్న ఈ హ్యుందాయ్ క్రెటా కారు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అమ్మకానికి ఉంది.


2. హ్యుందాయ్ క్రెటా (2016)
2016 మోడల్‌కి చెందిన హ్యుందాయ్ క్రెటా కారు ఇప్పటి వరకు 44,123 కి.మీ ప్రయాణించింది. డీజిల్ వెర్షన్ రకానికి చెందిన ఈ హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేయాలనుకునే వారు రూ.5.25 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది. సిల్వర్ కలర్ కారు ఓఎల్ఎక్స్ కోల్‌కతా జాబితాలో ఉంది.


3. హ్యుందాయ్ క్రెటా (2017) 
2017 సంవత్సరం మోడల్‌కి చెందిన హ్యుందాయ్ క్రెటా డీజిల్ ఇంజిన్‌ కారు ఇప్పటివరకు 1.05 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. రూ.6 లక్షల ధరకు అందుబాటులో ఉన్న ఈ కారు నలుపు రంగులో షైనింగ్ కోల్పోకుండా మెరుస్తూ కనిపిస్తోంది. ఇది ఢిల్లీకి సమీపంలోని మీరట్‌లో ఉంది.


ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే


ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు


ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ


ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook