Maruti Suzuki Fronks, Tata Punch, Baleno Sales: మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, మారుతి జిమ్నీని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా మారుతి సుజుకి ఫ్రాంక్స్ పేరిట మరొక SUV మోడల్ కారుని కూడా ఇండియన్ మార్కెట్‌కి పరిచయం చేసింది. మారుతి సుజుకి లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవి కారు ప్రత్యేకతలు ఏంటంటే.. చూడ్డానికి ఈ SUV లుక్ మినీ గ్రాండ్ వితారా తరహాలో కనిపిస్తోంది. మారుతి సుజుకి గతంలోనే లాంచ్ చేసిన బలెనో డిజైన్ డిజైన్ ఆధారంగా తయారు చేసిన ఈ కొత్త కారులో ఎస్‌యువి కారుకు ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మారుతి సుజుకి ప్రీమియం సేల్స్ ఔట్‌లెట్ నెక్సా షోరూమ్స్‌లో మాత్రమే ఈ కారు అందుబాటులోకి రానుంది. ఇటీవలే లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు కోసం బుకింగ్‌ కూడా ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలోనే భారత మార్కెట్‌లోకి కాలుమోపనున్న ఫ్రాంక్స్ కారు టాటా పంచ్‌ కారుతో పోటీపడుతుందని మారుతి సుజుకి భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే టాటా పంచ్ సేల్స్‌ని లక్ష్యంగా చేసుకునే ఫ్రాంక్స్ కారు లాంచ్ అయినట్టు మార్కెట్ వర్గాల టాక్. బలెనో డిజైన్, ఎస్‌యువి ఫీచర్స్‌తో వస్తున్న కారు కాబట్టి సేల్స్ పరంగా మారుతి బాలెనో కారుకు కూడా ఈ ఫ్రాంక్స్ కారు నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి.


మారుతి ఫ్రాంక్స్ ఎక్స్‌టీరియర్ లుక్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ గ్రాండ్ వితారాను పోలి ఉండగా, కలర్ స్కీమ్, కంప్లీట్ లుక్ చూస్తే మారుతి సుజుకి బలెనో గుర్తుకు రావడం ఖాయం. సిల్వర్ కలర్ రూఫ్ రేల్స్, బాడీ కలర్ ORVMలు, అల్లాయ్ వీల్స్‌ అమర్చారు. మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేసిన ఫ్రాంక్స్ కారు 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఫ్రాంక్స్ కారు పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,765 ఎంఎం, అలాగే 1,550 ఎంఎం ఎత్తుతో పాటు 2,520 ఎంఎం వీల్‌బేస్ కలిగి ఉంది.


మారుతి ఫ్రాంక్స్ ఇంటీరియర్ లుక్
మారుతి ఫ్రాంక్స్ కారు లోపలి భాగంలో 9 అంగుళాల సైజులో స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. ఫ్లాట్ బాటమ్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హెడ్-అప్ డిస్‌ప్లే అమర్చారు. 360-డిగ్రీ కెమెరా, 40కి పైగా కనెక్ట్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ థీమ్, మ్యాట్ ఫినిషింగ్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్‌‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మొత్తానికి బయ్యర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.


మారుతీ ఫ్రాంక్స్ ఇంజిన్ సామర్థ్యం
ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి రెండు పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ ద్వారా 89bhp , 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్ మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక రెండోది 1.0-లీటర్ K-సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్ కారు. 99bhp సామర్థ్యంతో 147.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. ఇటీవలే ఆటోఎక్స్‌పోలో లాంచ్ అయిన ఈ కారు ఈ ఏడాది మారుతి సుజుకిని సేల్స్ గ్రాఫ్‌లో పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కారు రాకతో టాటా పంచ్, మారుతి బాలెనో సేల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఆటో ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. సేఫ్టీ ర్యాంకింగ్స్ పరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉండే టాటా పంచ్ కారును ఢీకొట్టే కెపాసిటీ మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కి ఉంటుందా లేదా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.


ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?


ఇది కూడా చదవండి : iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్


ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి


ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook