Cheap Bike 2022: 72 వేల బజాజ్ బైక్‌లో సూపర్ ఫీచర్.. హీరో బైక్‌లో కూడా ఇప్పటివరకు ఈ ఫీచర్ లేదు!
Best Bike 2023, Bajaj Platina 110CC ABS coming with Front Disc Brake. ద్విచక్ర వాహన తయారీ సంస్థ `బజాజ్ ఆటో` ఇటీవలే కొత్త ప్లాటినా 110 ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను విడుదల చేసింది. ఈ బైక్‌లో సూపర్ ఫీచర్ ఉంది.
Bajaj Platina 110CC coming with Anti-lock braking system: ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇటీవలే కొత్త ప్లాటినా 110 ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 72,224 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). సింగిల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌తో వచ్చిన 110cc సెగ్మెంట్‌లో ఇది మొదటి బైక్. అంతేకాదు ఏకైక మోటార్‌సైకిల్ కూడా. ఈ సెగ్‌మెంట్‌లోని మరే ఇతర బైక్‌లోనూ ఏబీఎస్ ఫీచర్ లేదు. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' కూడా ఈ ఫీచర్‌ని తన 110 సీసీ మోడల్‌లో అందించడం లేదు.
డిజైన్ పరంగా కొత్త ప్లాటినా 110 ఏబీఎస్‌లో పెద్దగా మార్పు ఉండదు. 2023 బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ దాని ప్రామాణిక వేరియంట్‌ను పోలి ఉంటుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఈ బైక్ మూడు రంగులలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు సఫైర్ బ్లూ రంగులలో బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ రానుంది. ఇది 115.45cc బైక్. సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఇందులో 110cc కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లు వస్తున్నాయి. ముందువైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్ వస్తాయి. ఇది సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. బజాజ్ ప్లాటినా 110 ABS ధర ఢిల్లీలో రూ. 72,224లుగా ఉంది. ఈ బైక్ మార్కెట్లో ఉన్న TVS Radeon, Hero Splendor iSmart, Hero Passion Pro మరియు Honda CD 110 Dream వంటి వాటితో పోటీపడుతుంది.
Also Read: Jio Unlimited Plan: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ! ఈ జియో ప్లాన్ అద్భుతంగా ఉందిగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.