Cheapest Electric Scooter: 50 వేల లోపే 100 కిలో మీటర్లు ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే.. ఇలా కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్..
Cheapest Electric Scooter In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటీల ట్రెండ్ నడుస్తుంది. వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ స్కూటీలను కొనేందుకే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా తక్కువ ధరలో ఈ స్కూటీలు లభించడం విశేషం.
Cheapest Electric Scooter In India: రోజురోజుకు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లను వినియోగదారుల దృష్టిలో పెట్టుకొని..ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో బడ్జెట్ ధరల్లో లభ్యమయ్యే E స్కూటర్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే నిపుణులు సూచిస్తున్న ఈ క్రింద పేర్కొన్న రూపాయలు 50 వేల కంటే తక్కువ ధరలు ఉన్న వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తున్న బడ్జెట్ ధరల్లో ఉండే E స్కూటర్స్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోబోతున్నాం..
ఖరీదైన పెట్రోల్ ధరల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే బడ్జెట్ ధరల్లోనే ఈ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారు కోమాకి, బౌన్స్, అవాన్, ఇ-బోల్ట్ డెర్బీ, రాఫ్తార్ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయొచ్చు. అయితే వీటి ధరలు మీరు అనుకున్నంత ఎక్కువగాను ఏమీ ఉండవు. భారత మార్కెట్లో కేవలం పై ఈ స్కూటర్స్ ధరలు 50 వేల లోపే ఉంటాయి. అంతేకాకుండా విక్రయాల్లోనూ మార్కెట్లో లభించే ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటీ లతో పోటీ పడుతూ ఉంటాయి.
బౌన్స్ ఇన్ఫినిటీ:
భారతీయ మార్కెట్లో బౌన్స్ ఇన్ఫినిటీ ఈవెన్ ఈ స్కూటర్ సంచలనం సృష్టించింది. అధిక మొత్తంలో అమ్ముడైపోయిన వాటిల్లో E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికొస్తే రూ.45,099 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా గొప్ప ఫీచర్స్ తో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ లో అద్భుతమైన ఫ్యూచర్ ఏమిటంటే బ్యాటరీని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవచ్చు. ఈ బ్యాటరీ ని ఒక గంట పాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. అత్యధుక సాంకేతిక పరిజ్ఞానంతో చాలా రకాల ఫీచర్లను ఈ స్కూటీకి అమర్చారు.
Komaki X1:
ప్రస్తుతం చాలామంది వాడుతున్న ఎలక్ట్రిక్ స్కూటీల్లో Komaki కి కంపెనీకి చెందినది ఒకటి. ఇది కూడా ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తోంది. దీని ధర విషయానికొస్తే Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ రూ. 42,500 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిమీగా అధికారిక వెబ్సైట్లో తెలిపారు. X1 ఫుల్ బాడీ క్రాష్ గార్డ్ టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన ఇంజన్ ఇందులో అమర్చారు.
రాఫ్తార్ ఎలక్ట్రికా:
బడ్జెట్లో విలాసవంతమైన సెగ్మెంట్ తో కూడిన స్కూటీని కొనుగోలు చేయాలనుకుంటే.. తప్పకుండా రాఫ్తార్ ఎలక్ట్రికాని కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్లు ఉండడమే కాకుండా.. విలాసవంతంగా కనిపిస్తుంది. ఇది అన్ని స్కూటీల్లా కాకుండా ఒక గంట ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుంది. అంతేకాకుండా యాంటీ థెఫ్ట్ అలారం సహా అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!
Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook