Cheapest Flight Tickets: ఈ 22 మార్గాల్లో కేవలం 150 రూపాయలకే ఫ్లైట్ టికెట్
Cheapest Flight Tickets: విమాన ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ టికెట్ ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే విమానయానం అంటే సాధారణంగా ఎగువ మధ్యతరగతి ప్రజలకే వర్తిస్తుంది. కానీ అతి తక్కువ ధరకు విమానయానం చేసే అవకాశం కూడా ఉంది.
Cheapest Flight Tickets: అయితే కొన్నిసూచనలు పాటిస్తే తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. వివిధ విమానయాన సంస్థలు అందించే ప్రత్యేక ఆఫర్లు కావచ్చు లేదా ఉడాన్ విమానయానం కావచ్చు రకరకాలుగా ఆఫర్లు వస్తుంటాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే కచ్చితంగా అతి తక్కువ ధరకే ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేయవచ్చు.
దేశంలోని కొన్ని రూట్లలో కొన్ని విమానయాన సంస్థలు అందించే ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఫ్లైట్ టికెట్ 1000 రూపాయల్లోపే ఉంటుంది. లీలాబారి నుంచి అస్సోంకు అయితే కేవలం 150 రూపాయలకే వెళ్లవచ్చు. ఇది రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా అమలవుతోంది. దేశంలోని 22 రూట్లలో 1000 రూపాయలకంటే తక్కువలోనే ప్రయాణించవచ్చు. ప్రముఖ ట్రావెల్ పోర్టల్ Ixigo అందిస్తున్న వివరాల ప్రకారం ఒక్కొక్కరికి కనీస టికెట్ 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ స్కీమ్‌లో అత్యల్ప టికెట్ ధర లీలాబారి నుంచి అస్సోంకు కేవలం 150 రూపాయలుగా ఉంది.
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్‌లో ప్రయాణ సమయం దాదాపుగా 50 నిమిషాలుంటుంది. అంటే గంటలోపుంటుంది. ఈ స్కీమ్‌లో ఇలా మొత్తం 22 రూట్లు ఉన్నాయి. ఇందులో చాలావరకూ ఈశాన్య రాష్ట్రాల పరిధిలో ఉన్నవే. ఈ రూట్లలో బేసిక్ ధర 150 రూపాయల్నించి 199 రూపాయలవరకూ ఉంటుంది. దక్షిణాదిన కూడా బెంగళూరు-సేలం, కొచ్చిన్-సేలమ్ రూట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా గువహతి నుంచి షిల్లాంగ్‌కు కేవలం 400 రూపాయలు మాత్రమే. మరోవైపు ఇంఫాల్-ఐజ్వాల్, డీమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లీలాబారికు ఫ్లైట్ టికెట్ 500 రూపాయలుంది.
బెంగళూరు నుంచి సేలంకు 525 రూపాయుల కాగా గువహతి-పాసిఘాట్ టికెట్ 999 రూపాయలుంది. లీలాబారి నుంచి గువహతికు ఫ్లైట్ టికెట్ 954 రూపాయలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్లకు డిమాండ్ తక్కువగా ఉండటమే కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించాలంటే కనీసం 5-6 గంటలు సమయం పట్టేస్తుంటుంది. తక్కవ ధరకు టికెట్ ఆఫర్ చేయడం ద్వారా ఆక్సుపెన్సీ పెంచుకోవాలనేది విమానయాన సంస్థల ఆలోచనగా ఉంది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ దేశంలో ఇలాంటివి మొత్తం 559 రూట్లను గుర్తించింది. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
Also read: iPhone 16 Features: లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు, కెమేరా ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook