Used Maruti Baleno Cars Buy only Rs 5 Lakhs in Cars 24: డిసెంబర్ 2022లో భారత దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు 'మారుతి బాలెనో'. మారుతి కంపెనీ గత సంవత్సరం బాలెనో యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ మార్కెట్‌లో బాగా విక్రయించబడుతోంది. అయితే మీరు బాలెనో కారు కొనాలనుకుని.. అంతగా బడ్జెట్ లేకున్నా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. పాత మోడల్‌ (సెకండ్ హ్యాండ్) బాలెనోను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం మీ ముందుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్స్ 24 వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ బాలెనో కార్లు (Second Hand Maruti Baleno Cars) ఉన్నాయి. కొన్ని మోడల్స్ రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్యలో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. మారుతీ ఆల్టో ధరలో మంచి కండిషన్ ఉన్న మారుతి బాలెనో కారును మీరు ఇంటికి తీసుకెళిపోవచ్చు. మారుతీ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. కార్స్ 24 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్  బాలెనో కార్లు వివిధ నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితాను ఓసారి చూద్దాం. 


2015 Maruti Baleno ALPHA:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2015 మారుతీ బాలెనో ఆల్ఫా ధర రూ. 4,60,000లుగా ఉంది. ఈ కారు 80,238 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ కార్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది.


2016 Maruti Baleno DELTA:
2016 మారుతి బాలెనో డెల్టా కారు ధర రూ. 4,96,000. ఈ కారు 80,834 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది 1.2L పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ కారు కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది.


2017 Maruti Baleno DELTA:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2017 మారుతి బాలెనో డెల్టా కూడా జాబితా చేయబడింది. ఈ కారు ధర రూ. 4,82,000లుగా ఉండగా.. రీడింగ్ 79,157 కిలోమీటర్లు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఇందులో ఉన్నాయి. 


2016 Maruti Baleno ALPHA:
 2016 మారుతి బాలెనో ఆల్ఫా కూడా కార్స్ 24 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 4,99,000 లుగా ఉండగా.. రీడింగ్ 53,429 కిలోమీటర్లు. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌, మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. 


Also Read: Axar Patel Marriage: ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. ఫొటోలు వైరల్‌!  


Also Read: Ford Bronco Bookings: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. రూ. 2 లక్షలు మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.