Home Loan Interest Rates: సొంతింటి కలే మీ లక్ష్యమా? అయితే మీ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా. ఇందుకోసం బ్యాంకులో అందిస్తున్నటువంటి హౌసింగ్ లోన్ల ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు యధాస్తత స్థితి కొనసాగిస్తూ పెంచకుండా అలానే ఉంచింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్లకే బ్యాంకులో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. దీంతో హోమ్ లోన్లు వడ్డీ రేట్లు పెరగలేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే గృహ రుణం పొందే వారికి ఊరట అనే చెప్పాలి. తద్వారా మీ నెల వాయిదా అనేది పెరగకుండానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు సరికొత్త ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మాత్రం బ్యాంకుల వద్ద నుంచి రుణం పొందడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకులో ఆఫర్ చేస్తున్న ఇతర రుణాలతో పోల్చి చూస్తే గృహ రుణాలు చాలా తక్కువ వడ్డీలకే అందుబాటులో ఉంచాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులో 10 శాతం లోపు మాత్రమే హౌసింగ్ లోన్స్ ను అందుబాటులో ఉంచాయి. పలు బ్యాంకులు ఎనిమిది శాతం పైన ఈ రేటును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు గృహ రుణం పొందడం ద్వారా బయట లభించే ప్రైవేటు వడ్డీల కన్నా కూడా అతి తక్కువ వడ్డీకే మీరు బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం లభిస్తుంది.


మీరు బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నట్లయితే, ముందుగా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీరు రుణం పొందే అర్హతను సూచిస్తుంది. మీరు గతంలో ఏవైనా రుణం తీసుకొని ఉంటే వాటిని సకాలంలో చెల్లించినట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది ఈ క్రెడిట్ స్కోర్ ను సివిల్ సంస్థ అందిస్తుంది అందుకే దీన్ని సివిల్ స్కోర్ అని కూడా అంటారు ఈ సివిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.


Also Read: Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 11కు తీర్పు వాయిదా..!


మీ సిబిల్ స్కోర్ ఎనిమిది వందల ఎగువన ఉన్నట్లయితే మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణం పొందే అవకాశం లభిస్తుంది. మీ సిబిల్ స్కోర్ 700 ఎగువన ఉంటే కాస్త ఎక్కువ వడ్డీ రేట్లకే మీకు రుణం లభిస్తుంది. 600 మా ఇంట్లో కన్నా తక్కువ ఉన్నట్లయితే మీకు రుణం లభించడం అవుతుంది. 


ఏ బ్యాంకులో అతి తక్కువ వడ్డీ రేటుకి హోమ్ లోన్ లభిస్తుందో తెలుసుకుందాం:
 
ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  -  8.50 నుంచి 9.85 వరకూ , బ్యాంక్ ఆఫ్ బరోడా - 8.40 నుంచి 10.65 వరకూ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 8.35 నుంచి 10.75 వరకూ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 8.45 నుంచి 10.25 వరకూ,  బ్యాంక్ ఆఫ్ ఇండియా - 8.40 నుంచి 10.85, కెనరా బ్యాంక్ - 8.50 నుంచి 11.25, UCO బ్యాంక్ - 8.45 నుంచి 10.30, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 8.35 నుంచి 11.15, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 8.50 నుంచి 10.00, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 8.40 నుంచి 10.60, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 8.45 నుంచి 9.80 చొప్పున వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.


Also Read:  Bank Loan : ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్..భారీగా పెరిగిన వడ్డీ రేట్లు..!!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి