Citroen C3 Sales: ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ఎట్టకేలకు తమ కొత్త కారును ప్రకటించేసింది. కారు లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Citroen C3 ఎయిర్‌క్రాస్ ధరలను సంస్థ వెల్లడించింది. రూ. 9.99 లక్షల నుంచి ఈ కారు మోడల్ మార్కెట్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భారత మార్కెట్లో హ్యూందాయ్ క్రెటా మోడల్ కారుకి ప్రత్యర్థిగా Citroen C3 కారు వచ్చేసింది. అయితే కేవలం రూ. 25 వేల మొత్తంతో ఈ కారును ప్రీ - ఆర్డర్ టోకెన్ స్వీకరించవచ్చు. ఈ బుకింగ్ ను ఏదైనా సిట్రోయెన్ డీలర్ షిప్ లేదా కంపెనీ వెబ్ సైట్ లో ప్రీ - ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రీ - ఆర్డర్ కార్లు డెలివరీ ఎప్పుడంటే?
సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ కారును ముందుగా బుక్ చేసుకున్న వారికి అక్టోబరు 15 నుంచి డెలివరీ ఇవ్వనున్నారు. సరికొత్త Citroen C3 ఎయిర్‌క్రాస్ SUV.. 90 శాతానికి పైగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిందని తయారీ సంస్థ తెలిపింది. భారతీయ వినియోగుదారుల అవసరాలకు తగ్గట్లు రూపొందించారు. 


Citroen C3 ఎయిర్‌క్రాస్ కారు ఎలా ఉండనుంది?
సరికొత్త Citroen C3 Aircross SUV గురించి సంస్థ CEO, మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ బౌచారా "C3 Aircross SUV ఏప్రిల్ 2023లో ప్రారంభమైనప్పటికీ.. ఇప్పుడు ఈ కారుపై విశేషమైన సానుకూల స్పందన లభిస్తోంది. ఈ SUV యొక్క ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రకటించే క్రమంలో మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. రూ. 9.99 లక్షల ధరకు కారును అందుబాటులోకి తీసుకొచ్చాం. SUV కార్ల మార్కెట్లో మా కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మాకు నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు. 


Also Read: ITR Deadline Extended: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?  


సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUVలో 4,323 mm పొడవును కలిగి ఉంటుంది. దీని సిల్హౌట్ 200mm గ్రౌండ్ క్లియరెన్స్ తో పెద్ద చక్రాలు, టైర్ల వీల్ ఆర్చ్ లతో పాటు మన్నికైన క్లాడింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. బలమైన బంపర్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు రహదారుల నావిగేషన్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అలాగే రూఫ్ రెయిల్‌లు, వెనుక స్పాయిలర్ ఏరోడైనమిక్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా సిల్హౌట్‌కు శైలిని మెరుగుపరుస్తాయి.


Also Read: Navdeep Drug Case: హీరో నవదీప్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో అరెస్టు తప్పదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook