Citroen C3X Price: భారత్లో కార్ల వినియోగం ఎక్కువవ్వడంతో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు కార్ల తయారీ పరిశ్రమలను ప్రారంభిస్తున్నాయి. దీంతో అన్ని దేశాలకు సంబంధించిన కార్లు ప్రస్తుతం భారత్ మార్కెట్లో లభిస్తుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా భారత మార్కెట్లో కారును విడుదల చేయబోతోంది. ఈ కారు సి త్రీ ఎక్స్ క్రసోవర్ నామకరణంతో ప్రస్తుతం మార్కెట్లో లభించనుంది. ఇప్పటికే ఈ కంపెనీ మూడు కార్లను విడుదల చేసింది. ఈ విడుదల చేసిన కార్లు మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో ఎలక్ట్రానిక్ కార్లను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!  


ఈ కారును కంపెనీ CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించగా.. చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. Citroen C3X క్రాస్ఓవర్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజన్ పవర్ కెపాసిటీ విషయానికొస్తే..110 హెచ్‌పి పవర్ ఇంజన్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ కారును ఈవి వెర్షన్లో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఫీచర్ల అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ కారులో కొత్త ఫీచర్లు ఇవే:
ఈ ఫ్రెంచ్ కారు అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇక కొత్త ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, సీటింగ్, HVAC నియంత్రణలు, ADAS వంటి ఫీచర్లు లభించనున్నాయి. ఇక కారు ధర విషయానికొస్తే దాదాపు రూ. 15 లక్షల నుంచి రూ. 16 వరకు ఎక్సైజ్ షోరూం ధర ఉండబోతోందని సమాచారం..


Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook