ఎండాకాలం వచ్చేయడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అనివార్యం అయిపోయాయి. దీనికి తోడు బొగ్గు వెలికితీత అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఓ వైపు విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడుతోంది. 
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు భారతీయ రైల్వే చొరవ చూపించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యుత్తు సంక్షోభాన్ని నివారించడంలో భాగంగా బొగ్గు క్యారేజీలను వేగంగా తరలించడానికి 240 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.  ప్రస్తుతం భారతీయ రైల్వేలు బొగ్గు సరఫరా కోసం ఏకంగా 400 రేక్‌లను నడుపుతోంది. గత తొమ్మిదేళ్లలో బొగ్గు నిల్వలు ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరోవైపు భారత్‌లో గరిష్ట విద్యుత్తు వినియోగం నమోదు అవుతోంది. దీనికి తోడు ఈ వినియోగం వచ్చే నెలలో ఎండల కారణంగా మరో ఎనిమిది శాతం వరకు పెరుగవచ్చని విద్యుత్తు మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. 


కేంద్ర విద్యుత్, రైల్వే మంత్రిత్వశాఖలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. డిమాండ్ కు తగ్గ బొగ్గు సప్లై పై చర్చించాయి. ఎండల కారణంగా భారీగా పెరిగిపోయిన డిమాండ్‌ను తీర్చడానికి ప్రస్తుత డిమాండ్‌ను 422 బొగ్గు రేకులను నడపాలని రైల్వేశాఖను కోరింది. బొగ్గు నిల్వలు ఘననీయంగా పడిపోవడంతో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మరో మార్గం లేదని సూచించింది. మరోవైపు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీ సచివాలయంలో బొగ్గు కొరతపై అత్యవసర సమావేశం నిర్వహించి బొగ్గు సప్లై పెంచాలని థర్మల్ కేంద్రానికి లేఖ రాశారు. లేదంటే త్వరలో దేశరాజదాని ఢిల్లీతో సహా పలు నగరాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేయలేమని తేల్చిచెప్పారు. 


మరోవైపు దాద్రీ-II పవర్ ప్లాంట్‌లో కేవలం ఒకరోజుకు మాత్రమే సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి.... ఉంచాహర్ పవర్ ప్లాంట్‌లో రెండు రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మాత్రమే సరిపడ స్టాక్ ఉంది.  కహల్‌గావ్‌లోని థర్మల్ కోల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేస్తే కేవలం మూడున్నర రోజులకు సరిపడిన స్టాక్ మాత్రమే మిగిలి ఉంది. ఇలా దేశంలోని పలు ప్లాంట్లలో స్టాక్ లేకపవడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సంక్షోభం ముదరకుండా ఉండేందుకు రైల్వే శాఖ తన శక్తికి మించి సేవలు అందిస్తోంది. 


also read  త్వరలో భారత్‌లో 5జీ సేవలు


also read   పే పర్ మూవీ ఫీచర్‌ తీసుకొచ్చిన అమోజాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook