Credit Card UPI: ఈ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో యూపీఐ నుంచి చెల్లింపులు
UPI Payment Through Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా త్వరలో యూపీఐ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌తో రూపే కార్డుల లింకింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి లావాదేవీలు నిర్వహించవచ్చు.
UPI Payment Through Credit Card: స్టేట్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. త్వరలో రూపే కార్డులను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పేమెంట్స్‌తో అనుసంధానించనుంది. ఇది క్రెడిట్ కార్డుల వినియోగంలో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం రూపే కార్డులను జారీ చేయడంతో ఎస్‌బీఐ మొదటిస్థానంలో ఉంది. ఎస్‌బీఐ పోర్ట్ ఫోలియోలో 11 శాతం రూపే కార్డులను కలిగి ఉంది. యూపీఐతో పేమెంట్స్ లింక్ చేస్తే.. ఇది సంచలనంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎస్‌బీఐ కార్డు 25వ వార్షికోత్సవం సందర్భంగా సీఈఓ, ఎండీ రామమోహన్ రావు అమరా మాట్లాడుతూ.. బ్యాంక్ రూపే కార్డ్, యూపీఐ లింకింగ్ త్వరలో పూర్తవుతుందని చెప్పారు. ఎస్‌బీఐ కార్డ్ దేశంలోనే అతిపెద్ద రూపే కార్డ్ జారీదారు అని.. ఐఆర్‌సీటీసీ, బీపీసీఎల్‌తో కో-బ్రాండెడ్ కార్డ్‌లను కూడా కలిగి ఉందన్నారు. చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీల వల్ల కలిగే నష్టాల కంటే యూపీఐలో క్రెడిట్ కార్డుతో భారీ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. మర్చంట్ లావాదేవీల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రజలు చిన్న మొత్తం చెల్లింపులకు యూపీఐ లావాదేవీలను, పెద్ద మొత్తంలో లావాదేవీలకు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారని అన్నారు.
క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేస్తే.. ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తుందన్నారు. అప్పుడు యూపీఐ ద్వారా కూడా భారీ మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మర్చంట్ ఫీజు మినహాయింపు రూ.2 వేలలోపు లావాదేవీలపై మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. ఎస్‌బీఐ కార్డు వృద్ధి దాని మొత్తం పరిశ్రమ కంటే ఆకట్టుకునేలా ఉందన్నారు. కార్డ్ పరిశ్రమ 18 శాతం వృద్ధి రేటుతో 8.5 కోట్ల కొత్త కార్డులను జారీ చేసిందని.. అయితే ఎస్‌బీఐ కార్డ్ మాత్రమే 22 శాతం సీఎజీఆర్ వృద్ధితో 1.17 కోట్ల కొత్త కార్డులను జారీ చేసిందని వెల్లడించారు. అదేవిధంగా ఖర్చుల పరంగా ఎస్‌బీఐ కార్డు టాప్‌లో ఉందన్నారు. ఇండస్ట్రీ కోసం 26 శాతం నుంచి మేము ఖర్చులలో 28 శాతం వృద్ధి సాధించామన్నారు.
Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్
Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి