వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. అయితే ఇన్ని రోజుల పాటు పెట్టుబడిదారులకు కాసుల పంట పండించిన క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఇన్వెస్టర్లకు నష్టాలు మిగుల్చుతోంది.
క్రిప్టో కరెన్సీల వాల్యులు ఇటీవల భారీగా పడిపోతుండడంతో వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. ఇన్ని రోజులు లాభాలు చవి చూసిన వాళ్లకు ఇప్పుడు ఒక్కసారిగా నష్టాలు రావడంతో అవాక్కు అవుతున్నారు. రోజు రోజుకు క్రిప్టో కరెన్సీ విలవ పడిపోతుండడంతో లక్షలకు లక్షలు ఆవిరి అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీలోని బిట్ కాయిన్ లో మాత్రమే కాకుండా.... డోజ్‌‌కాయిన్, కార్డానో వంటి కరెన్సీల వాల్యు కూడా మునుపటి కంటే సగానికి సగం పడిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరు నెలల కిందట బిట్ కాయిన్ వ్యాల్యూ 60 వేల డాలర్లపైన నమోదు అయింది.  అప్పటి ధరతో పోల్చితే ఇప్పుడు బిట్ కాయిన్ ధర సగానికి సగం పడిపోయింది. క్రిప్టో కరెన్సీలోని ఒక్క బిట్ కాయిన్ విలువ మాత్రమే కాదు, ఇథెరియం వాల్యు కూడా ఇలాగే పతనం అయింది.  బిట్ కాయిన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో మార్కెట్‌లో ఇథెరియం రెండో స్థానాన్ని దక్కించుకుంది. పలు దేశాల్లో పెట్టుబడిదారులు ఇథెరియంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఈ ఇథెరియం వాల్యు కూడా గత ఆరు నెలలో 42 శాతానికి తగ్గిపోయింది. ఆరు నెలల కిందట 4800 డాలర్ల వద్ద ట్రేడైన ఇథెరియం ... ఇప్పుడు 2661 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరో క్రిప్టో కరెన్సీ అయిన డోజ్‌కాయిన్ వాల్యు పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది. ఆరు నెలల్లో డోజ్‌కాయిన్ విలువ 52 శాతానికి పడిపోయింది. కార్డానో కరెన్సీ కూడా ప్రస్తుతం 0.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


ఈ పతానానికి కారణంగా ఇన్వెస్టర్లు ఇబ్బందిగా ఫీల్ అవడమే అంటున్నారు నిపుణులు. డిజిటల్ కరెన్సీపై మొదట మోజుతో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిస్క్ ఫీల్ అవుతున్నారని సమాచారం. క్రిప్టో ఒక రిస్క్ బిజినెస్‌గా భావిస్తున్నారని సమాచారం. లాభాలు మాట అటు ఉంచితే ఏమైనా తేడా కొడితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్లు తమ దగ్గర ఉన్న మొత్తంలోంచి కేవలం చిన్న మొత్తాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టాలని నిపుణులు సూచిస్తుండడంతో చాలా మంది  పెట్టుబడిదారులు ఈపాటికే తాము పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు క్రిప్టో కరెన్సీలపై పలు ఆంక్షలను విధించడంతో పాటు ట్యాక్సులు వేస్తుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు ఈరంగం నుంచి తప్పుకుంటున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీ విలువ మునుపటిలా దూసుకుపోలేకపోతోంది. 


also read  Oppo F21 Pro 5G: రూ.31 వేల విలువైన Oppo F21 Pro 5G రూ.12 వేలకే అందుబాటులో!


also read Flipkart Tv Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆ టీవీపై 25 వేల రూపాయలు భారీ డిస్కౌంట్, ఇవాళే చివరిరోజు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook