Indian Exports: 2021-22లో భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్!
Indian Exports: మేడ్ ఇండియా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 83 శాతం పెరిగే అవకాశముంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
Indian Exports: ఇండియా నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశీయ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 83 శాతం పెరగొచ్చని అంచనాలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.42 వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు జరిగాయని ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా కథనంలో పేర్కొంది.
ఈ కథనం ప్రకారం.. 2020-21లో, కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింది. మైక్రోచిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా తగ్గాయి. చిప్‌ల కొరత ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. గడిచిన నాలుగేళ్లలో దేశీయ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 32 శాతం పెరిగాయని తేలింది.
నాలుగేళ్ల కిందట ఇలా..
2017-18లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ రూ.1,300 కోట్లుగా ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగేళ్లలో ఈ విలువ రూ.42,000లకు చేరడం విశేషం.
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.42 వేల కోట్ల ఎగుమతులు నమోదవగా అందులో రూ.20 వేల కోట్ల విలువైన ఎగుమతులు కేవలం శాంసంగ్ ఫోన్లకు, రూ.12,000 వేల కోట్ల విలువైన ఎగుమతులు యాపిల్ ఐఫోన్లకు సంబంధించినవే కావడం గమనార్హం.
డిమాండ్ పెరిగేందుకు కారణాలు..
'కరోనా విషయంలో చైనాపై వచ్చిన వ్యతిరేకత, భారత్ చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘటన తర్వాత.. దేశీయంగా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు.. తయారీ ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) ప్రకటించడం వంటి చర్యలతో భారత్‌లో ఉత్పత్తి భారీగా పెరిగింది. భారత్‌లో ఉత్పత్తయిన వివిధ కంపెనీల ఫోన్లకు దక్షిణాసియా, ఐరోపాల నుంచి డిమాండ్ పెరిగింది. దీనితో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకున్నాయి.' అని ఇండియన్ సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) నివేదిక తెలిపింది.
Also read: EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook