Wheat price భారత్‌లో గోధుమ ధరలు తగ్గనున్నాయి. గోధుమలపై కేంద్రం ఎగుమతి నిషేధించడంతో ధరలు దేశవ్యాప్తంగా దిగిరానున్నాయి. ఎగుమతుల కారణంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా గోధమతో పాటు గోధుమ పిండి రిటైల్ ధర ఏకంగా 19 శాతం పెరిగినట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సుభాన్ష్ పాండే ప్రకటించారు.  అయితే ఇప్పుడు ఎగుమతులపై నిషేధం విధించడంతో ధరలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. ఎగుమతులకు తోడు రష్యా-ఉక్రెయిన్ల మధ్య సంక్షోభం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా గోధుమల ఉత్పత్తి తగ్గడం, ప్రభుత్వ సేకరణలో అలస్యం వహించడం వంటివి కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని ఆయన చెప్పారు.  ఇకపై కూడా గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తామని ఆయన వెల్లడించారు. మిగతా దేశాల్లో టన్ను గోధుమలు 420 డాలర్ల నుంచి 480 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతున్నాయని ఆయన చెప్పారు. దీంతో పోల్చితే మన దగ్గర ధరలు అంత ఎక్కువేమి లేవని ఆయన చెప్పారు. త్వరలోనే గోధుమ ధరలను నియంత్రిస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


ముందు అంతర్జాతీయ సమాజానికి గోధుమలను సరఫరా చేస్తామని భారత్ ప్రకటించింది. అయితే ఆతర్వాత దేశంలో నెలకొన్న కొరత కారణంగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ప్రపంచ దేశాలు భారత్‌పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జర్మనీలో సమావేశమైన ఏడు పారిశ్రామిక దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు ఈమేరకు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఒకరికొరకు సాయం చేసుకోవాలే కాని ఇలా సొంత ప్రయోజనాలు చూసుకోవడం సరికాదని పలు దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన భారత్ త్వరలోనే అన్ని సర్దుకుంటాయాని హామీయిచ్చింది. గోధుమల ఎగుమతిలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే ఈసారి ఈ ఎగుమతులు ఐదు శాతం తగ్గిపోయాయి. గత ఆరేళ్లలో గోధుమల ఉత్పత్తి ఆరు శాతం తగ్గడం ఇదే మొదటి సారి కావడంతో ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.


also read  Smart TV Offer: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.17,999 విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.6999కే...


also read crypto markets సున్నాకు పడిపోయిన లూనా కరెన్సీ విలువ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.