DHANA LAXMI BANK ధన లక్ష్మీ...ఈ పేరు వింటేనే దక్షిణాదిన ఎంతో క్రేజ్... 1927లో కేరళలోని త్రిసూర్‌లో ఏర్పాటు అయిన ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. 94 ఏళ్ల చరిత్ ఉన్న ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. దేశవ్యాప్తంగా 533 బ్రాంచీలతో దూసుకుపోతున్న ఈ బ్యాంకు కూడా వినియోగదారలకు లబ్ది చేకూర్చేందుకు వడ్డీ రేట్లు పెంచింది.  డొమెస్టిక్, నాన్ రెసిడెన్షియల్ టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని తెలిపింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన వారికి ఈ వడ్డీ పెంపు వర్తిస్తుందని తెలిపింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితి సేవింగ్ చేసిన వారికి ఈ వడ్డీ పెంపు వర్తింస్తుందని తెలిపింది. ప్రస్తుతం  46 రోజుల నుంచి 90 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి 3.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 91 రోజుల నుంచి 179 రోజుల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసిన వారికి 4 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేట్లను 
4.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 రోజుల కంటే ఎక్కవ రోజులు ఫిక్స్ డిపాజిట్ చేసిన వారికి వడ్డీ రేటు 4.25 శాతం నుంచి 4.5 శాతానికి పెంచేసింది.ఏడాది నుంచి రెండేళ్ల వరకుఎఫ్‌డీలపై  5.15 శాతం వడ్డీ రేటను పెంచేసింది. ఇక 555 రోజుల పాటు ఎఫ్‌డీలు చేసిన వారికి 5.55 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసిన వారికి ఏకంగా 5.3 శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఫిక్స్‌డిపాట్ చేస్తే 5.4 శాతం వడ్డీని....1100 రోజుల కాల పరిమితిలోని డిపాజిట్లకు 5.45 శాతం వడ్డీ రేటు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ టర్మ్ డిపాజిట్‌ను 1100 రోజుల నుంచి 1111 రోజులకు పెంచింది. ఇక ఐదు నుంచి పది సంవత్సరాలకు ఫిక్డ్ డిపాజిట్ చేస్తే 5.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రకటించింది. ఇక సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేస్తే వడ్డీ రేట్లు మరింత పెంచుతామని వెల్లడించింది. చాలా కాలంగా వినియోగదారులకు సేవలు అందిస్తున్న తాము వినియోగదారులను ఆకట్టుకొని వారికి మరింత దగ్గర అయ్యేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ బ్యాకింగ్ సేవలు అంత మెరుగ్గా లేవని అందుకే చాలా మంది వినియోగదారులు ఇతర బ్యాంకులకు మళ్లుతున్నారని తద్వారా కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకొని వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ధనలక్ష్మీ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతోందని విశ్లేషలు అంటున్నారు. మొత్తానికి వడ్డీ రేట్లు పెంచడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్న వాళ్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook