Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold Price Today: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
Gold Silver Rate Today: దీపావళికి ముందు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు ధనత్రయోదశి కావడంతో దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీగా చేస్తారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ధరలు (Gold silver price today 23 october 2022) పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.830 వరకు పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1550 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.63,200గా ఉంది. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ ధరలు మార్కెట్లో ఉదయం 6 గంటలకు నమోదైనవి.
దేశంలోని ప్రధాన నగరాల్లో...
>>దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 ఉంది.
>>ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
>>కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.
>>బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో...
>>హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.
>>విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతుంది.
>>విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,280గా ఉంది.
Also Read: EPFO Bonus: దీపావళి బోనస్ ప్రకటించిన ఈపీఎఫ్ఓ, ఎవరికి ఎంత బోనస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook