Dhanteras Gold Shopping 2024:  హిందువులంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. అయితే దీపావళి పండగకు ముందు రోజున అంటే ఆశ్వీయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ పండగ దేశవ్యాప్తంగా దీపావళి ముందు రోజు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ ధన త్రయోదశి అక్టోబర్ 29వ తేదీన వచ్చింది. ఈరోజు శ్రీమహావిష్ణువే సాక్షాత్తు ధన్వంతరిగా అవతరించాడు.. అలాగే ఈ రోజున ఆయుర్వేదం కూడా ఉద్భవించిందని హిందువుల నమ్మకం అందుకే ఈ ధన త్రయోదశి రోజున ధన్వంతరిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ పండగను ఉత్తరాది రాష్ట్రాల్లో దంతే రాస్ కూడా అని అంటారు. ఈ రోజున నార్త్ ఇండియన్ ఎక్కువగా ప్రత్యేకమైన పూజల్లో పాల్గొని బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందని పూర్వీకుల నుంచి ఇప్పటివరకు హిందువులు నమ్ముతున్నారు. అలాగే ఈరోజు బంగారు రంగులో ఉండే వస్తువులు కొనుగోలు చేయడం కూడా చాలా శుభ్రతమని భావిస్తారు. అయితే మీరు కూడా ఇంట్లోనే ఉండి సులభంగా బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన త్రయోదశి రోజున ఇంట్లో నుంచి కాలు కదపకుండా సులభంగా కేవలం రూ.100కే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధన త్రయోదశి రోజున గోల్డ్ షాపులలో జనాలు ఎగబడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలావరకు ఈ సమయంలో బంగారం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా గోల్డ్ షాప్ కి వెళ్లి పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తులం బంగారం కొనుగోలు చేస్తే.. దానికి తోకగా జిఎస్టి, తరుగు, ఇలా వివిధ టాక్స్లను పే చేయాల్సి ఉంటుంది. అన్ని పోను తులం బంగారం మీ చేతికి రావడానికి దాదాపు రూ.87 వేలకు పైగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే మీరు ఇంత మొత్తంలో చెల్లించకుండా తక్కువ ధరలోనే బంగారం కొనుగోలు చేయాలనుకుంటే అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.. 


ధన త్రయోదశి రోజున ఇంట్లోనే కూర్చుండి అతి తక్కువ ధరలోనే బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. డిజిటల్ బంగారం వీరికి గొప్ప అవకాశం గా నిలుస్తుంది. ఈరోజు మామూలుగా వర్చువల్ గోల్డ్ కొనుగోలు చేయని వారు డిజిటల్ గోల్డ్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఏది కొనుగోలు చేసిన బంగారమే.. కేవలం రూ. 100లతోనే ప్రారంభమయ్యే ఈ డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం ఎంతో సులభం.. ఇంట్లోనే కూర్చుని ఫోన్ పే లేదా పేటీఎంలో వినియోగించి డిజిటల్ గోల్డ్ ను ఎంతో సులభంగా కేవలం 10 నిమిషాల్లోనే కొనుగోలు చేయవచ్చు. ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి దీనికంటే ప్రత్యామ్నాయాలు ఇంకేమీ లేవు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అయితే ఇందులో గోల్డ్ కొనుగోలు చేసేవారు ముందుగా గోల్డ్ డిజిటల్ వాలెట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓపెన్ చేయడం కూడా ఎంతో సులభం. కేవలం పది నిమిషాలు ప్రాసెస్ తో డిజిటల్ గోల్డ్ వాలెట్ను ఓపెన్ చేయవచ్చు. అయితే ఈ వ్యాలెట్లు దాదాపు ఒక్క రూపాయి నుంచి మొదలుకొని బంగారాన్ని రెండు లక్షల వరకు నిలువ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిని చిన్న కాయిన్ రూపంలో కూడా ఇంటికి డెలివరీ ఆప్షన్ ద్వారా పొందవచ్చు. దాదాపు 6 గ్రాముల కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారికి హోమ్ డెలివరీ గోల్డ్ కాయిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ను వినియోగించి దాదాపు 6 గ్రాముల నుంచి ఎంతైనా ఇంటికి గోల్డ్ డెలివరీ పంపవచ్చు. ఈ విధంగా ధన త్రయోదశి రోజున మీకు నచ్చినంత గోల్డ్ పై పెట్టుబడి పెట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.