Diesel Price Hike: వాహనదారులకు షాకింగ్ న్యూస్! ఇకపై డీజిల్ పై రూ. 25 పెంచనున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ ధరలు యథాతధంగా కొనసాగుతాయని చమురు సంస్థలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 విక్రయిస్తుండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రూ.94.14 ధరకు అందుబాటులో ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉండగా.. రిటైల్ లో రూ.86.67 ధరకు విక్రయిస్తున్నారు. 


భారతదేశ వ్యాప్తంగా బల్క్ డీజిల్ కొనుగోలు దారులతో పోలిస్తే రిటైల్ బంకుల్లో డీజిల్ ధరలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది రిటైల్ స్టేషన్లలో డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని అనేక మాల్స్, విమానాశ్రయాలు వంటి భారీ విద్యుత్తు వినియోగ సముదాయాల్లో డీజిల్ జనరేట్లను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు బల్క్ లో లీటర్ డీజిల్ పై రూ. 25 పెంపు చేయడం వల్ల సదరు సంస్థలు అన్నీ రిటైల్ పెట్రోల్ బంకులపై ఆధారపడుతున్నాయి.   


Also Read: Netflix: నెట్‌ఫ్లిక్స్ 'స్కిప్ ఇంట్రో'.. ఈ ఒక్క ఆప్షన్‌తో ఎంత సమయం ఆదా అవుతోందో తెలిస్తే షాకవుతారు..


Also Read: Alerts for Mozilla Firefox Users: మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూసర్లకు కేంద్రం హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు