e-PAN:  ప్రస్తుత కాలంలో పాన్ కార్డు లేకుండా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలను మనము చేపట్టలేము. బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, లేదా ఏదైనా రుణం పొందాలనుకున్నా, ఇన్‌కం టాక్స్ ఫైల్ చేయాలన్నా కూడా పాన్ కార్డు అనేది తప్పనిసరి. PAN కార్డు అనేది దేశంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10 అంకెల కోడ్. పన్ను చెల్లింపు కోసం దేశంలోని పౌరులు, సంస్థలకు పాన్ కార్డ్ జారీ చేస్తారు. పాన్ కార్డ్ ప్రతి పన్ను చెల్లింపుదారునికి గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ప్రస్తుతం మనం మేము డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ పాన్ కార్డు గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఇది మీకు ప్యాన్ కార్డు లేకపోయినా ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ ప్యాన్ కార్డు ఎలా పొందాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

e-PAN అనేది ఒక ఎలక్ట్రానిక్‌ జెనరేటివ్ ఉత్పత్తి. తక్షణమే పాన్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో PAN కార్డ్ PDF ఫార్మాట్‌లో జారీ అవుతుంది. వినియోగదారులు దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. E-PAN అనేది డిజిటల్ సంతకం చేసిన పత్రం. ఇది ఆధార్ ద్వారా e-KYC చేసిన తర్వాత జారీ అవుతుంది.


దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడు తక్షణ e-PAN సేవ  ప్రయోజనాన్ని పొందవచ్చు. మీకు పాన్ లేకపోయినా చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ ఉంటే, మీరు వెంటనే ఇ-పాన్‌ని పొందవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.


Also Read : Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!


డిజిటల్ పాన్ కార్డు ఎలా పొందాలి:


- మొదట ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, ఆపై 'ఇన్‌స్టంట్ ఇ-పాన్' ఆప్షన్ కోసం సెర్చ్ చేయండి. 


- ఇ-పాన్ పేజీలోకి వెళ్లిన తర్వాత, 'కొత్త ఇ-పాన్ పొందండి' బటన్‌పై క్లిక్ చేయండి


- ఇప్పుడు కొత్త ఇ-పాన్ పొందేందుకు పేజీలో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత, చెక్‌బాక్స్‌ను టిక్ చేసి, ఆపై 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.


-ఇప్పుడు OTP ఆథంటిఫికేషన్ పేజీలో, నిబంధనలు  షరతులను అంగీకరించి, మీకు కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, ఆపై కంటిన్యూపై క్లిక్ చేయండి.


-OTP ఆథంటిఫికేషన్ పేజీలో మీరు 6 అంకెల OTPని ఎంటర్ చేయాలి. ఈ OTP మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న  మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఇప్పుడు UIDAIతో మీ ఆధార్ వివరాలను గుర్తించడానికి  చెక్‌బాక్స్‌ని సెలక్ట్ చేసుకుని అందులో  'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.


-మీరు 'ఆధార్ వివరాలను కన్ఫర్మ్ చేసుకోండి' పేజీకి లోకి వెళ్లినప్పుడు, 'నిబంధనలు  షరతులు' ఒకే చేయడానికి మీరు చెక్‌బాక్స్‌ని మరోసారి టిక్ చేయాలి. దీని తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.


- కావాల్సిన వివరాలన్నింటిని ఎంటర్ చేసిన తర్వాత మీరు స్క్రీన్‌పై కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది.  ఈ సందేశంలో రసీదు సంఖ్య కూడా ఉంటుంది. ఈ నంబర్‌తో మీరు భవిష్యత్తులో ఇ-పాన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.


Also Read : Ola Shares: మార్కెట్లో జెట్ స్పీడ్‎తో దూసుకెళ్తున్న ఓలా..వరుసగా రెండోరోజు 20శాతం పెరిగిన షేరు..!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook