రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. మరి కొద్దిగంటల్లో అంటే డిసెంబర్ 1 నుంచి డిజిటల్ రూపీ లావాదేవీలు ప్రారంభించనుంది. రిటైల్ స్థాయిలో డిజిటల్ రూపీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ నిమిత్తం డిసెంబర్ 1 నుంచి డిజిటల్ రూపీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది ఆర్బీఐ. డిజిటల్ రూపీ తొలి దశ ప్రారంభం కానుంది. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో లీగల్ టెండర్‌గా ఉంటుంది. ప్రస్తుతం వర్చువల్ రూపీకు ఏ విధమైన విలువ ఉందో..అదే విలువ కలిగి ఉంటుంది డిజిటల్ రూపీ. పైలట్ ప్రాజెక్టుగా 4 బ్యాంకులతో ఈ డిజిటల్ రూపీ ప్రారంభమౌతుంది. 


లావాదేవీలు ఎలా ఉంటాయి


వ్యాపార సంస్థలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. భాగస్వామ్య బ్యాంకుల ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్స్‌లోని డిజిటల్ వాలెట్ ద్వారా ఇ రూపీ లావాదేవీలు సమర్దవంతంగా జరపవచ్చు. లావాదేవీలను వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి సంస్థకు చేయవచ్చు.


నాలుగు బ్యాంకులతో


తొలి దశ పైలట్ ప్రాజెక్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ సహా నాలుగు బ్యాంకులున్నాయి. దీనిని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్‌లో అందుబాటులో ఉంటుంది. డిజిటల్ రూపీని బ్యాంకుల ద్వారా అమలు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులోని భాగస్వామ్య బ్యాంకులు ప్రవేశపెట్టిన డిజిటల్ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరపగలరు.


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ ఎరియర్ల బకాయిలకు గ్రీన్ సిగ్నల్, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook