Union Budget 2022: Digital University Announced for Across Students: కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా దేశంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. చాలా నెలల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో విద్యార్థులు చాలా నష్టపోయారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులు. అందుకే కేంద్ర బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అంతేకాదు టీవీల ద్వారా అనుబంధ విద్యను అందించనున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్‌లో విద్యా రంగంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. 'ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని విస్తరించనున్నాం. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్‌ ఛానళ్లు ఉన్నాయి. వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నాం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో బోధన చేపట్టనున్నాం. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌, టీవీ, రేడియోల ద్వారా బోధన ఉంటుంది. మరోవైపు ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం' అని చెప్పారు. 


విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా, అర్థం అయ్యేలా పలు భారతీయ భాషల్లో కోర్సులను ఈ వర్సిటీ అందించనుందన్నారు. ప్రస్తుతం ఉన్న అగ్ర యూనివర్సిటీల సహకారంతో ఈ డిజిటల్ వర్సిటీలో కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర బడ్జెట్ 2022లో నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. 


వ్యవసాయ యూనివర్శిటీ సిలబస్‌లో మార్పులు చేపట్టనున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జీరో బడ్జెట్‌ సాగు, సేంద్రీయ సాగు, అధునాత వ్యవసాయం, వాల్యూ అడిషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నామని చెప్పారు. సెలబస్‌ మార్పుల కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.


Also Read: Samantha - Karthi: ఫుల్‌ జోష్‌లో సమంత.. తమిళ స్టార్ హీరోకి ఒకే చెప్పేసింది!!


Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook