Disney Plus Hotstar Subscription: ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కొత్తగా నెలవారీ మొబైల్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 49 సబ్‌స్క్రిప్షన్‌తో ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సరికొత్త ప్లాన్ ద్వారా యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌ (స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌)లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను పొందగలరు. 720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. ఇందులో యాడ్స్‌ కూడా ఉంటాయి. 


దీని గురించి డిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ పలువురు యూజర్స్ రెడిట్ సామాజిక మాధ్యమం ద్వారా రూ.49 ప్లాన్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అయితే రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నే కార్డ్‌, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు రూ.49కే అందజేస్తున్నట్లు మరికొంతమంది యూజర్స్ పేర్కొన్నారు. 


నెట్ ఫ్లిక్స్ బాటలో..


అయితే ఇదే నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌ కూడా సబ్‌స్క్రిప్షన్ ధరలను 60 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ ఇక మీదట రూ. 149కే లభించనుంది. అలానే బేసిక్ ప్లాన్‌ ధరను రూ. 199కి, స్టాండర్డ్‌ ప్లాన్‌ రూ. 499, ప్రీమియం ప్లాన్‌ రూ. 649కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 


మరోవైపు అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వార్షిక చందాను రూ.999 నుంచి రూ.1499కి పెంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. త్రైమాసిక చందా ప్రస్తుతం రూ.329 ఉండగా.. దాన్ని రూ.459కి పెంచనున్నట్లు పేర్కొంది. నెలవారీ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.129 చెల్లిస్తుండగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. 


అమెజాన్ ప్రైమ్ తగ్గనున్న యూజర్లు!
అయితే మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ తో పోటీగా ఉన్న సంస్థలైన డిస్నీ+హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. చందాదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ధరలను తగ్గిస్తున్నారని తెలుస్తోంది.


మరోవైపు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచిన నేపథ్యంలో మిగిలిన టాప్ ఓటీటీ సంస్థలైన డిస్నీ+హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లకు భారీగా చందాదారులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  


Also Read: Netflix offers: తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్.. రూ.149 నుంచే ప్రారంభం


ALso Read: Amazon prime Price hike: ప్రైమ్​ యూజర్లకు అమెజాన్ షాక్​- సబ్​స్క్రిప్షన్ ధరలు పెంపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి