Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?
Diwali Muhurat Trading 2022: స్టాక్ మార్కెట్లో దీపావళి నాడు సెలవు దినంగానే పాటించినప్పటికీ.. సాయంత్రం ఒక గంట మాత్రమే ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Diwali Muhurat Trading 2022: బాంబే స్టాక్ మార్కెట్ (బిఎస్ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్ఎస్ఇ) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ సాయంత్రం 6.15 గంటల నుండి 7.15 గంటల వరకు ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ఒక్క ఈ సెషన్ ఈ రోజు స్టాక్స్ ట్రేడింగ్ చేయడానికి వీలు ఉంటుంది. అంతకంటే ముందుగా 6 గంటల నుండి 6.08 గంటల వరకు 8 నిమిషాల పాటు ప్రీ - ఓపెన్ సెషన్ ఉంటుంది.
హిందువుల పంచాంగం ప్రకారం దీపావళి నాడే కొత్త సంవాత్ ప్రారంభమవుతుంది. సంవాత్ అంటే హిందూ సంప్రదాయంలోని క్యాలెండర్ ఇయర్. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు పాటించినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారు దీపావళిని కూడా ఒక కొత్త సంవత్సరంగానే భావిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొనడం వల్ల రాబోయే ఏడాది పాటు వారి ఇంట సిరులు కురుస్తాయనేది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారి విశ్వాసం. అందుకే కొత్త ఏడాది సెంటిమెంట్‌ని పురస్కరించుకుని ఈరోజు ముహూరత్ ట్రేడింగ్ చేయడం అనేది స్టాక్ మార్కెట్‌లో ఒక ఆనవాయితీగా వస్తోంది.
బీఎస్ఈలో 1957 లోనే దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయం ప్రారంభం కాగా నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లో 1992 లో ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. ఈ సంవాత్ గురించి బ్రొకరేజ్ అండ్ రిసెర్చ్ సంస్థ యాక్సిస్ సెక్యురిటీస్ మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లో వృద్ధి కనిపిస్తుందని, శుభసూచకంగా ఉంటుందని వెల్లడించింది.
ఇదిలావుంటే, ఈ ఏడాది కొంత ప్రతికూల పరిస్థితులు తప్పేలా లేవని హెచ్.డి.ఎఫ్.సి సెక్యురిటీస్ పేర్కొంది. దీపావళి పండగ నాడు లక్ష్మీ దేవి పూజను పురస్కరించుకుని అక్టోబర్ 24న ( సాయంత్రం గంటసేపు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ మినహాయించి), దీపావళి బలిప్రతిపాద పండగను పురస్కరించుకుని అక్టోబర్ 26న స్టాక్ మార్కెట్స్ సెలవు పాటించనున్నాయి.
Also Read : Multibagger stocks: దీపావళికి ముందే బంపర్ లాభాలు ఆర్జించిన షేర్, నెలలో రెట్టింపు ధర
Also Read : Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Also Read : EPFO Bonus: దీపావళి బోనస్ ప్రకటించిన ఈపీఎఫ్ఓ, ఎవరికి ఎంత బోనస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి