Reduce Electricity Bill In Summers: కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందేందుకు ఈ పని చేయండి..!
How To Reduce Electricity Bill In Summers:వేసవిలో విద్యుత్ బిల్లు అధికంగా రావడం మధ్యతరగతి కుంటుబాలకు సమస్యగా మారింది. గంటల తరబడి ఏసీలు, కూలర్లు నడపడం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగం ఏర్పడుతుంది.
How To Reduce Electricity Bill In Summers: వేసవిలో విద్యుత్ బిల్లు అధికంగా రావడం మధ్యతరగతి కుంటుబాలకు సమస్యగా మారింది. గంటల తరబడి ఏసీలు, కూలర్లు నడపడం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో విద్యుత్ వినియోగం తగ్గించడానికి చాలా రకాల ట్రిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం కరెంట్ బిల్ ఛార్జీలు పెరగడంతో వివిధ రకాలుగా ఈ భారాన్ని తగ్గించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కరెంటు వినియోగాన్ని, బిల్లును తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలను ఇప్పుడు తెసుకుందాం..
చిన్న మార్పుతో పెద్ద లాభం పొందవచ్చు:
సాధారణంగా వేసవి కాలంలో కరెంటు బిల్లులు భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్లు, ఏసీల వినియోగం అధికంగా ఉంటుంది. అధిక విద్యుత్ బిల్లు సమస్యను ఎదుర్కొంటే ముందుగా ఇంట్లో ఉండే ఉపకరణాలను మాత్రమే మార్చాలి.
సాధారణ బల్బు విద్యుత్ వినియోగాన్ని పెంచుతుంది..!:
మీరు ఇప్పటికీ పాత బల్బులను ఉపయోగిస్తుంటే.. వాటికిని తీసివేయాలి. ఈ బల్బుల వల్ల విద్యుత్ బిల్లు వేగంగా పెరుగుతుంది. వాటిని తీసివేయం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. వాటికి బదులుగా ఇంట్లో LED బల్బులను ఉపయోగించడం మంచిది. LED బల్బ్ లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా భారీ బిల్లుల నుంచి మిమ్మల్ని ఆదా చేస్తుంది.
ఈ రకమైన ఎయిర్ కండీషనర్ ఉపయోగించడం మానుకోండి:
వేసవి రోజుల్లో ఏసీ వాడకం సర్వసాధారణం. ఒకవేళ ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని వాడుతున్నట్లయితే.. అవసరమైన సమయంలో మాత్రమే ఆన్ చేయండి. అధిక కెపాసిటీ ఉన్న ACలు చాలా విద్యుత్తును వినియోగిస్తాయి. దాని ప్రభావం బిల్లుపై కనిపిస్తుంది.
పాత ఫ్యాషన్ AC:
నేటికీ చాలా ఇళ్లలో పాత ఏసీనే వాడుతున్నారు. ఇది చాలా విద్యుత్తును వినియోగిస్తుంది. అధిక విద్యుత్ వినియోగం వల్ల బిల్లు అధికంగా పెరుగుతుంది. అందుకే పాత ఏసీకి బదులు 5 స్టార్ రేటింగ్ ఉన్న కొత్త ఏసీని కొనండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ACలు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.
Also Read: Ex Minister Narayana Arrest: పదోవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్టు
Also Read: Narayana On Ktr: మోడీ వల్లే కేటీఆర్ మాట మార్చారు.. సీపీఐ నారాయణ సంచలనం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook