Bank Holidays List In October: దసరా ఫెస్టివల్ మానియా మొదలైంది. ఇప్పటికే నగరాలు, పట్టణాలు ఉన్న వాళ్లు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, ట్రైన్స్ బుక్ చేసుకుని.. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. నవరాత్రి, దసరా కారణంగా బ్యాంకులకు కూడా సెలవులు వచ్చాయి. వినియోగదారులు ఇబ్బందులు పడుకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే సెలవుల జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈసారి లాంగ్‌ వీకెండ్‌తో కలిపి దసరా రానుంది. అయితే బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయని చాలా మంది అయోమయంలో ఉన్నారు. దసరా రోజున ఏయే నగరాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడతాయి..? ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి..? పూర్తి వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 23వ తేదీన దసరా సెలవు ఉంటుంది. త్రిపుర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కాన్పూర్, కేరళ, జార్ఖండ్, బీహార్‌ రాష్ట్రాలలో బ్యాంకులకు హాలీ డే ఉంటుంది. దసరా (విజయదశమి), దుర్గాపూజ కోసం అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్, మణిపూర్ మినహా అనేక రాష్ట్రాల్లో సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.  


ఈ నెల 21న దుర్గాపూజ (మహా సప్తమి) సందర్భంగా త్రిపుర, అస్సాం, మణిపూర్, బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 22న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే. సోమవారం దసరా కారణంగా బ్యాంకులు బంద్. బ్యాంకు సెలవుల సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. 


ఈ నెలలో సెలవులు ఇలా..


==>> అక్టోబర్ 25- దుర్గా పూజ (దసైన్)-సిక్కింలో బ్యాంకులకు సెలవు.
==>> అక్టోబర్ 26– దుర్గా పూజ (దసైన్)/విలీన దినం–సిక్కిం, జమ్మూ, కాశ్మీర్‌లో బ్యాంకులకు హాలీ డే
==>> అక్టోబర్ 27- దుర్గా పూజ (దసైన్) - సిక్కింలో బ్యాంకులు బంద్
==>> అక్టోబర్ 28- లక్ష్మీ పూజ సందర్బంగా బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు
==>> అక్టోబర్ 31- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లో బ్యాంకులకు హాలీ డే.


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి