Economic Survey 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం ఇవాళ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్​ సన్యాల్​ మీడియా సమావేశంలో ఆర్థిక సర్వే-2022పై ప్రసంగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వే 2022లోని ముఖ్యాంశాలు..


  • వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8-8.5 శాతంగా నమోదవ్వచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనా 9.2 శాతం, ఇక కరోనా మొదటి దశలోని 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్​ 6.6 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కొవిడ్ భయాలతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం ఇందుకు కారణం.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ద్రవ్యలోటు 6.8 శాతంగా నమోదవ్వచ్చు.  2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 9.2 శాతంగా ఉంది. (ఆదాయం.. ఖర్చుల మధ్య వ్యత్యాసమే ఈ ద్రవ్య లోటు. ఆదాయం కన్నా ఖర్చులు తక్కువగా ఉంటే దానిని మిగులు అంటారు.)

  • 2021-22లో హోల్​సేల్ ధరల ద్రవ్యోల్బణం సగటు 12.5 శాతంగా వెల్లడించింది ఆర్థిక సర్వే. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 5.2 శాతంగా తెలిపింది.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయం, మత్స్య రంగాల వృద్ధి 3.9 శాతంగా అంచనా వేసింది ఆర్థిక సర్వే 2022. ఈదే సమయంలో పారిశ్రామికోత్పత్తి 11.8 శాతంగా అంచనా వేసింది.  2020-21లో పారిశ్రామికోత్పత్తి -7 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 308.6 మిలియన్ టన్నుల ఆహర ధాన్యాలు ఉత్పత్తయ్యాయి. అంతకు ముందు 2019-20 ఆర్థిక సంవత్సంలో ఈ సంఖ్య 297.5 మిలియన్ టన్నులుగా ఉంది.

  • సేవా రంగం గత ఆర్థిక సంవత్సరం (2020-21) -8.4 శాతంగా నమోదైంది. 2021-22లో సేవా రంగ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండొచ్చు.

  • 2021 డిసెంబర్ నాటికి దేశీయంగా అన్ని కార్ల తయారీ సంస్థలు 7 లక్షల కార్ల ఆర్డర్లను పెండింగ్​లో పెట్టాయి. సెమికండక్టర్ల కొరత కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు డెలివరీలు చేయలేకపోయాయి.

  • దేశంలో ఐపీఓల జోరు నడుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (నవంబర్ వరరకు) 75 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీలన్న రూ.89,066 కోట్లు సమీకరించాయి.

  • దేశంలో స్టార్టప్​ల కల్చర్​ కూడా పెరిగింది. దేశంలో 555 జిల్లాల్లో కనీసం ఒక స్టార్టప్​ ఉంది. ప్రపంచంలోన స్టార్టప్​లు అత్యధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, చైనాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.


Also read: Stock Market today: బడ్జెట్​ 2022 ముందు సూచీలు భళా- భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు


Also read: Flipkart Electronics Sale 2022: రూ.4,500లకే శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ- ఈరోజే తుదిగడువు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook