Edible oil prices likely to drop in Coming Days: కరోనా మహమ్మారి అనంతరం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. నిత్యావసరాలైన ఆయిల్, పెట్రోల్, డీసెల్, వంట గ్యాస్, కూరగాయలు కొనడం ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెను భారంగా మారింది. అయితే ఆయిల్ ధరలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పామాయిల్ ధరలు కూడా రానున్న రోజులల్లో మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోనే పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ ఒకటి. ఇది దేశంలో ఎడిబుల్ ఆయిల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. భారత్ జూలైలో 530,420 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోగా.. ఆగస్టులో 994,997 టన్నులు దిగుమతి చేసుకుంది. ఇక సెప్టెంబర్‌ నెలలో 1 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో పామాయిల్ దిగుమతి చేసుకుంది. జూలై నెలతో పోలిస్తే.. ఆగస్టులో దిగుమతి 87 శాతం పెరిగింది. 


అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరలు ఏకంగా 40 శాతం తగ్గాయి. మెట్రిక్ టన్ను పామాయిల్ ధర 1800-1900 డాలర్ల నుంచి 1000-1100 డాలర్లకు తగ్గింది. దాంతో వచ్చే రోజులో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. పామాయిల్ మిగిలిన ఎడిబుల్ ఆయిల్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. అందుకే కంపెనీలు పామాయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. వచ్చే రోజుల్లో దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పామాయిల్‌కు డిమాండ్ పెరగనుంది. పామాయిల్ దిగుమతిపై ప్రభుత్వం 5.5 శాతం పన్ను విధించింది.


Also Read: Cobra OTT Release: అప్పుడే ఓటీటీలోకి విక్రమ్‌ 'కోబ్రా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?  


Also Read: సరికొత్తగా ప్రమోషన్స్‌.. రాజకీయాల మాదిరి పాదయాత్ర మొదలెట్టిన హీరో నాగశౌర్య! ఇదే మొదటిసారి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook