New EPF Rules: ఏప్రిల్ నుంచి మారనున్న పీఎఫ్ రూల్స్.. పూర్తి వివరాలు ఇవే..
New EPF Rules: ఈ నెలతో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసి.. కొత్త ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది. దీనితో ఏప్రిల్ 1 నుంచి పలు ఆర్థికపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
New EPF Rules: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మరో రెండు మరో మూడు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దీనితో.. కొత్త రూల్స్ కూడా అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ముఖ్యంగా పీఎఫ్ ఖాతాలో అధికంగా జమ చేసేవారిపై పన్ను విధించి ఉద్దేశంతో ఈ మార్పులను తీసుకురానుంది ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పులను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పీఎఫ్ ఖాతాలను రెండుగా విభజింజనుంది. అందులో ఒకటి పన్ను వర్తించేది కాగా.. రెండోది పన్ను మినహాయింపు ఉండేది.
కొత్త నిబంధనల గురించి వివరంగా..
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ ఖాతాలు.. ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ అనే క్యాటగిరీలుగా విడిపోతున్నాయి.
2021 మార్చి 31 నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నింబంధనలను వర్తిస్తాయని కూడా ప్రభుత్వం పేర్కొంది.
కొత్త నిబందనల ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా.. ఉద్యోగి వాటా జమ అయితే వారు ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అంటే.. భారీగా ఆదాయం గడించే వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అదనపు పన్ను భారం పడనుంది.
ఇక పన్ను పరిధిలోకి వచ్చే ఖాతాదారులకు.. ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు కూడా నిలిచిపోనున్నాయి. తక్కువ ఆదాయం వచ్చే వారికి సహాయం చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కొత్త నిబంధనల ద్వారా సులభంగా.. పన్ను పరిధిలోకి వచ్చే వారిని గుర్తించొచ్చని కేంద్రం గతంలో పేర్కొంది.
Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?
Also read: iPhone 14: విడుదలకు ముందే యాపిల్ ఐఫోన్ 14 ఫీచర్లు లీక్- 48 ఎంపీ కెమెరాతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook