PF Accounts: రెండు భాగాలుగా పీఎఫ్ అకౌంట్స్.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే!
PF Accounts: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లను ఇకపై.. రెండు భాగాలుగా విభజించనుంది ప్రభుత్వం. ఏడాది ఏప్రిల్ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
PF Accounts: వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి పీఎఫ్ ఖాతా రెండు భాగాలుగా విభజించే వీలుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం నోటిఫై చేసిన కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. ఇప్పటికే ఉన్న పీఎఫ్ ఖాతాలను రెండు భాగాలుగా విభజన కానున్నాయి.
పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా విభజించడం ద్వారా.. వార్షికంగా ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలకన్నా ఎక్కువుగా ఉంటే.. అదనంగా జమ అయిన మొత్తంపై పన్ను వసూలు చేసేందుకు వీలు కల్పించనుంది.
దీనితో పాటు సంపాదన అధికంగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి మినహాయించేందుకూ ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది.
ముఖ్యమైన విషయాలు..
ఏప్రిల్ 1 తర్వాత పీఎఫ్ ఖాతాలన్ని రెండు భాగాలుగా విడిపోనున్నాయి. ఒకటి ట్యాక్సబుల్ అకౌంట్. రెండోది నాన్ ట్యాక్సబుల్ అకౌంట్.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు పీఎఫ్ చందాదారులందరికీ వర్తించనున్నాయి. అయితే 2021 మార్చి 31తో నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నింబంధనలను వర్తింపజేయనుంది ప్రభుత్వం.
పీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వాటా.. రూ.2.5 లక్షలు దాటితే.. దానిపై పన్ను విధించనుంది ఐటీ విభాగం. ఇందుకోసం సెక్షన్ 9డీని ఐటీ చట్టాల్లోకి తెచ్చింది కేంద్రం.
ట్యాక్సబుల్ అకౌంట్ పరిధిలికి వచ్చే వారికి మాత్రమే అదనపు పన్ను భారం పడనుంది. నాన్ ట్యాక్సబుల్ ఖాతా ఉన్న వారికి ఎప్పటిలానే అన్ని బెనిఫిట్స్ అందుతాయి.
పీఎఫ్ ఖాతాల అధికంగా జమ చేస్తూ చాలా మంది సంపన్నులు పన్ను మినహాయింపులు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగానే గత ఏడాది పీఎఫ్ ఖాతాలను విభజించాలని నిర్ణయించింది.
Also read: iPhone SE 3: యాపిల్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..!
Also read: PM Kisan Yojana 2022: పీఎం కిసాన్ 11వ విడత అమలు ఎప్పుడు? కొత్త రిజిస్ట్రేషన్ ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook